»   » మహేష్ టైం మామూలుగా లేదు

మహేష్ టైం మామూలుగా లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. వదిలిన ఒక్క టీజర్ తోనే ఓ రేంజిలో బిజినెస్ ఆఫర్స్ సంపాదించుకుంటున్న ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ సైతం రీసెంట్ గా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమచారం. ఇప్పటివరకూ మహేష్ కెరీర్ లోనే ఈ రేటు రాలేదని చెప్పుకుంటున్నారు.

జీ తెలుగు వారు ..ఓ భారీ మొత్తానికి (బయిటకు రాలేదు) ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమచారం. ఇంతకు ముందు శ్రీమంతుడు చిత్రాన్ని సైతం జీ తెలుగువారే శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. శ్రీమంతుడు చిత్రంతో టీఆర్పీలు బాగా వచ్చి యాడ్ రెవిన్యూ ని బాగా సంపాదించినట్లు సమాచారం.దాంతో బ్రహ్మోత్సవంపై బాగా ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.


అలాగే నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన టీజర్ కు వచ్చిన క్రేజ్ తో ఈ చిత్రం ఓవర్ సీస్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.ఓవర్ సీస్ లో రైట్స్ కోసం చిత్ర నిర్మాతలు పీవిపి వారు పదమూడు కోట్లు చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఓవర్ సీస్ లో పేరెన్నికగన్న ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్ద నెగోషియేషన్ స్టేజీలో ఉంది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకూ ఈ స్ధాయిలో ఓవర్ సీస్ లో రేటు పలకలేదు.


శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే ఈ రేటు ఫిక్స్ చేయటానికి కారణం అంటున్నారు. మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ టీజర్ కూడా ప్లస్ అయ్యింది. ఇక్కడ ఆ టీజర్ ని మరోసారి చూడండి.


ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

English summary
Zee Telugu have bought Brahmotsavam satellite rights for an awesome price which is the highest for any Mahesh Babu film till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu