For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నారా రోహిత్ కి ఫిక్సయింది

  By Staff
  |

  Nara Rohit
  నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రం మే నాలుగవ తేదీన ప్రారంభం కానుంది. దంతలూరి చైతన్య దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఓ కుర్రాడు ఐపియస్ ఆఫీసర్ అవటం కధ అని వినపడుతోంది. ఇక 'రాజకుమారుడు'తో మహేష్ నూ, 'చిరుత'తో రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ పరిచయమైన 'గంగోత్రి','ఒకటో నెంబర్ కుర్రాడు'తో తారకరత్నను పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ ఉన్న నిర్మాత అశ్వనీదత్ రూపొందిస్తున్న చిత్రం కావటంతో ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ నారా రోహిత్ మరెవరో కాదు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు సోదరుడైన నారా రామమూర్తినాయుడి తనయుడు. ఇక ఈ చిత్రంలో అతని ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేస్తే బావుంటుంది అనే దానికి రకరకాలగా ఆలోచించి చివరకు తమన్నాని సెలక్ట్ చేసినట్లు సమాచారం. మొదట స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రారంభిస్తారని అన్నారు. కానీ ఇప్పుడు డేట్ మార్చారు.

  ఇక ఈ సినిమా నిర్మాణం కూడా రాజకీయంగా ఓ స్ట్రాటజీ ప్రకారమేనంటున్నారు. పార్టీ టిక్కెట్ రాక నిరాశచెందిన నారా రామ్ముర్తి నాయుడు బుజ్జగించటానికే ఈ ప్రయత్నం అని అంటున్నారు. చంద్రబాబు సూచనపైనే ఈ నిర్ణయానికి అశ్వనీదత్ వచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చను కూడా బాబే భరించే అవకాశాలనున్నాయని గుసగుసలువినపడుతున్నాయి. గతంలో అశ్వనీదత్ చాలా మంది తెలుగు వారస హీరోలను విజయవంతంగా లాంచింగ్ చేసిన అనుభవంతో ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

  ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించేందుకు అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మే 4న ఈ చిత్రం ప్రారంభమవుతుందనీ, వైజాగ్, విజయనంగరం, బొబ్బిలి, కర్ణాటకలోని కొన్ని ముఖ్య ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, గంధం నాగరాజు మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  ఇక ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న దంతులూరి చైతన్య ప్రస్తుతం హ్యాపీడేస్ నికిల్ హీరోగా బసంతి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మొదట సురేష్ ప్రొడక్షన్స్ లో వినపించిన ఈ స్క్రిప్టు అక్కడ ఓకే కాకపోవటంతో అశ్వనీదత్ దగ్గరకు చేరింది. కొత్త బంగారు లోకం సినిమాకు పనిచేసిన టీమ్ లో కొంతమంది టెక్నికల్ ఈ చిత్రానికి సపోర్టు చేయనున్నారు. ప్రస్తుతం అశ్వనీదత్ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం అధినేతగా కాక ఓ టాప్ హీరోగా ఈ ప్రారంభోత్సవానికి పిలవటానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.తమన్నా హీరోయిన్ అవటం ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాసం ఉంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X