For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్లాన్స్ ‘అల్లు’తాడట.. సినిమాలో అవన్నీ ఉంటాయ్.. మెగా, అల్లు ఫ్యామిలీలను టార్గెట్ చేసిన వర్మ

  |

  రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి బాంబులు పేల్చుతాడో ఎవ్వరం చెప్పలేం. ఏ ఫ్యామిలీని, ఏ హీరోను టార్గెట్ చేస్తాడో చెప్పడం చాలా కష్టం. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తోన్న ఆర్జీవీ నేడు ఏకంగా ఓ సెటైరికల్ సినిమానే ప్రకటించాడు. అది కూడా అల్లు అరవింద్‌ను సెంటర్ చేసుకుని. అల్లు అంటూ తన తదుపరి చిత్రం టైటిల్‌ను ప్రకటించాడు వర్మ. అందులో ఎవరెవరి క్యారెక్టర్స్ ఉంటాయో, ఏ ఏ సంఘటనలుంటాయో మరీ పూసగుచ్చినట్టు వివరించాడు.

  ఫిక్షనల్ రియాలిటీ..

  ఫిక్షనల్ రియాలిటీ..

  వర్మ గత రెండు మూడు రోజులుగా ఫిక్షనల్, రియాల్టీ అంటూ ఏవేవో ట్వీట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఆ కేసులో ఎవరెవరుంటారో, వారందరి విషయాలను బయటపెడతానని చేసిన ట్వీట్లు పెను సంచలనంగా మారాయి. అందులో భాగంగానే మొదటి చిత్రం అల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించాడు.

  అక్కడి నుంచి మొదలు..

  అక్కడి నుంచి మొదలు..

  ఆర్జీవీ తన తదుపరి చిత్రం అల్లు అని ప్రకటించాడు. ఓ ఫ్యామిలీకి చెందిన పెద్ద స్టార్ వెనుకు ఉన్న బావమరిది కథ ఇది అని తెలిపాడు. ఆ స్టార్ జన రాజ్యం అనే పార్టీని పెట్టిన తరువాత జరిగిన కథను ఇందులో చూపించబోతోన్నట్టు కాసేపటి క్రతమే ఓ బాంబ్ పేల్చాడు.

  అందుకే ఆ టైటిల్..

  అందుకే ఆ టైటిల్..

  తన సినిమాకు అల్లు అనే టైటిల్ ఎందుకు పెట్టాడో ఆర్జీవీ వివరణ ఇచ్చాడు.‘ "అల్లు" అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ "అల్లు"తూ వుంటాడు. తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్ ల అల్లుడు లో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి "అల్లు"డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడ'ని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

  ఆహాను కూడా లాగాడు..

  ఆహాను కూడా లాగాడు..

  అల్లు అరవింద్ సొంత ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాను కూడా వర్మ వాడేశాడు. వరుసగా ట్వీట్లు చేస్తున్న వర్మ.. ‘అందరితో తనని "ఆహా" అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ "అల్లు"' అంటూ ఆహా, అల్లుల గురించి వివరణ ఇచ్చుకున్నాడు.

  క్యారెక్టర్స్ ఇవే..

  క్యారెక్టర్స్ ఇవే..

  అల్లు చిత్రంలో ఉండబోయే పాత్రల గురించి వర్మ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఏ ఆరవింద్, కే చిరాంజీవి, ప్రవన్ కళ్యాణ్, ఏ ఆర్జున్, కే ఆర్ చరణ్; ఎన్ బాబు అంటూ కొన్ని పేర్లను ప్రకటించాడు. ప్రస్తుతం వర్మ చేస్తున్న వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయి.

  Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
  అందరూ అనుకుంటున్నట్టు..

  అందరూ అనుకుంటున్నట్టు..

  కొందరు అనుకుంటున్నట్టు తనను నికృష్ణుడు అని తిట్టినందుకు రివేజ్ తీసుకోవడం లేదు, ఇది నాన్ ఫిక్షనల్ సినిమా కాదు.. ఆ ఫ్యామిలీ మీదున్న ప్రేమ మీద ఒట్టేసి చెబుతున్నా అంటూ వర్మ మరో ట్వీట్ చేసి అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో పార్టీ టిక్కెట్లు అమ్ముకోవడం, థియేటర్ల మాఫియా, ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ముల మధ్య దూరం పెంచడం లాంటివేమీ ఉండవని మరో సెటైర్ వేశాడు.

  English summary
  RGV Next Film Titled As Allu. Another one of RgvWorldTheatre’s next Fictional Reality FR films is It is the fictional story of what one brother in law from behind did to the family of a very big star ..The story starts after the star announces his “Jana Rajyam” Party
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X