100000 రూపాయలతో OG టికెట్ కొన్న అభిమాని.. డబ్బును థియేటర్ ఓనర్ ఏం చేశాడో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం OG. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 25, 2025న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, టికెట్ బుక్కింగ్స్ కు సంబంధించిన ఏర్పాటు కూడా ముగిశాయి. తాజాగా థియేటర్లలోనూ టికెట్ బుక్కింగ్స్ ఓపెన్ కావడం విశేషం. కాగా చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు భారీ ధరకు టికెట్ కొనడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఓజీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టికెట్‌ను లక్ష రూపాయిలకు పవన్ కళ్యాణ్ అభిమాని కొనుగోలు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే గురువారం రిలీజ్ కాబోతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు చిత్తూరు జిల్లా ఫస్ట్ టికెట్ ను నేను కొనుగోలు చేశాను. జనసేన పార్టీ నాయకులతో మాట్లాడి ఈ టికెట్ ను కొనుగోలు చేశాను. అయితే ఈ డబ్బులను థియేటర్ యాజమాన్యం చిత్తూరు పరిధిలో ఉన్న నాయిని చెరువు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్‌కు పంపించేందుకు సిద్ధమైందని చెప్పారు.

ఈ విషయంలో జనసేన పార్టీ వారు సానుకూలంగా స్పందించారు. చిత్తూరు జిల్లా ప్రజలు కూడా ఓజీ సినిమాను చూసి తరించాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన చిత్తూరు జిల్లా రాఘవ థియేటర్ ఓనర్లు పవన్, శంకర్ కు ధన్యావాదాలు అని తెలిపారు. ఆ తర్వాత థియేటర్ ఆవరణంలో పవన్ కళ్యాణ్ కు జై కొడుతూ నినాదాలు చేశారు. ఇలా అభిమానులు పవన్ కళ్యాణ్ పై ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికే 5 లక్షలు వెచ్చించి నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ టీమ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఓజీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 21న గ్రాండ్ గా లాంఛింగ్ మధ్య విడుదల కానుంది. ఇప్పటికే ఓజీ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ఇతర ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై భారీ అంచనాలన పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి నటిస్తుండటం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు.
మరోవైపు ఓజీ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రెట్లను పెంచుతూ జీవోనూ కూడా జారీ చేసింది. ప్రస్తుతం బుక్కింగ్స్ కూడా ప్రారభం కావడం విశేషం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్స్ కు రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లకు టికెట్ ధరపై రూ.150 పెంచారు. ఇక బెనెఫిట్ షో టికెట్ కు రూ.800 కావడం విశేషం. ఈ షో సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు పడనుంది.


Click it and Unblock the Notifications










