మెగాహీరో చేయాల్సిన సినిమా రామ్ కి.. రామ్ చేయాల్సిన సినిమా మరో మెగాహీరోకి!

సినీ పరిశ్రమలో ఒక హీరో చేయాలి అనుకున్న కథతో మరో హీరో సినిమా చేసి రిలీజ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే హిట్ అవుతాయా ? ఫ్లాప్ అవుతాయా ? అనే సంగతి పక్కన పెడితే కాంబినేషన్స్ మార్పు మాత్రం ఆసక్తికరంగా మారింది. తాజాగా అలాంటి రెండు ఆసక్తికర కాంబినేషన్స్ మార్పు అంశం వెలుగులోకి వచ్చింది. ఆ విషయంలోకి వెళితే

డేట్స్ కావలెను

డేట్స్ కావలెను

దేశవ్యాప్తంగా కరోనా కేసులు కల్లోలం రేపుతున్న నేపథ్యంలో గత ఏడాది లాక్ డౌన్ విధించారు. ఆ లాక్ డౌన్ దెబ్బకు చాన్నాళ్ల పాటు అందరూ ఇళ్లలోనే ఉండిపోవాలని పరిస్థితి ఏర్పడింది. ఆ లాక్ డౌన్ దెబ్బకు మరో రెండు మూడేళ్ల దాకా సినిమా హీరోల డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి దాకా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు.

ఆ పరిస్థితి లేదు

ఆ పరిస్థితి లేదు

అయితే ఇప్పటికే కాంబినేషన్స్ సెట్ చేసుకున్న దర్శకుల పని పర్వాలేదు కానీ కాంబినేషన్ సెట్ చేసుకోకుండా హీరోలను వెతుక్కునే దర్శకులకు మాత్రం ఇప్పుడు హీరోలను వెతకడం కత్తి మీద సాములా మారింది. ఫలానా హీరోతో సినిమా చేయాలని భీష్మించుకుని కూర్చునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆ హీరో ఎప్పటికీ అందుబాటులోకి వస్తాడో, ఎవరూ చెప్పలేని పరిస్థితి.

కధల మార్పు

కధల మార్పు

ఈ క్రమంలో టాలీవుడ్లో రెండు ఆసక్తికర కాంబినేషన్స్ మారాయని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించాల్సిన సినిమా రామ్ చేతికి అలాగే రామ్ కోసం రెడీ చేసిన ఒక కథ వరుణ్ తేజ్ చేతికి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కాంబినేషన్ ల మార్పు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

రామ్ చేయాల్సిన కధతో వరుణ్ తేజ్

రామ్ చేయాల్సిన కధతో వరుణ్ తేజ్

చివరిగా రాజశేఖర్ తో గరుడ వేగ అనే సినిమా చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు మొన్నీమధ్య తమన్నాతో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఆ వెబ్ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదు అనుకోండి అది వేరే విషయం. ఆయన ఇప్పుడు నాగార్జునతో ఒక సినిమా చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే ఆయన తాజాగా వరుణ్ తేజ్ ను కలిసి ఒక కథ ఒప్పించినట్లు సమాచారం. ఈ కథ ఆయన గతంలో రామ్ కోసం సిద్ధం చేశాడని అంటున్నారు.

అల్లు అర్జున్ కధతో రామ్

అల్లు అర్జున్ కధతో రామ్

అప్పట్లో బడ్జెట్ ఎక్కువ అవుతుందేమోనని ఉద్దేశంతో ఈ సినిమా చేయడానికి రామ్ ఆసక్తి చూపించలేదట. ఇక ఆ విషయం పక్కన పెడితే రెడ్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ అందుకున్న లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. అయితే జరుగుతున్న ప్రచారం మేరకు ఈ కథతో లింగస్వామి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నాడట.

గతంలో అల్లు అర్జున్ లింగుస్వామి కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటన కూడా వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Recommended Video

Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
ఆసక్తికర కాంబినేషన్స్

ఆసక్తికర కాంబినేషన్స్

ఆ ఆగిపోయిన కథతోనే ఇప్పుడు రామ్ ను ఒప్పించి సినిమా చేస్తున్నాడట లింగుస్వామి. అలా మొత్తం మీద రామ్ కోసం అనుకున్న కథతో వరుణ్ తేజ్, బన్నీ కోసం అనుకున్న కథతో రామ్ సినిమాలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X