For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda Celebrities Review : మాస్ ఫీస్ట్.. బాలయ్య దెబ్బకు స్టార్స్ ఫిదా.. మహేష్ టు నాని, ఏమంటున్నారు అంటే?

  |

  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ. ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలతో బాలయ్య బోయపాటి కాంబినేషన్ మీద ఒక ఆసక్తి నెలకొనగా అందుకు తగ్గట్టుగానే సినిమా ఉంది. ఇక ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  తెల్లవారు జాము నుంచి

  తెల్లవారు జాము నుంచి

  నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. ఈ రోజు తెల్లవారు జాము నుంచి అభిమానుల హడావిడి తో తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇక కరోనా నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో సినిమా విడుదల అవుతూ ఉండడంతో ఇండస్ట్రీలో నుంచి సైతం సినిమాకు మంచి సపోర్ట్ లభిస్తోంది.

  ప్రశంసలు

  ప్రశంసలు

  ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి సినీ ప్రముఖులు కూడా తమ స్పందన తెలియ చేస్తున్నారు. ఒకరకంగా సినిమా బాగుందని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్స్ లలో పాత వెలుగులు నిండడంతో మిగతా హీరోలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు కూడా అఖండ బాక్సాఫీస్ స్టార్టింగ్ పై ఆనందం వ్యక్తం చేశారు.

  మహేష్ బాబు ట్విట్టర్ లో

  మహేష్ బాబు ట్విట్టర్ లో

  అఖండ మంచి ఆరంభాన్ని అందుకోవడం హ్యాపీ గా ఉంది అంటూ నందమూరి బాలకృష్ణ సహా దర్శకుడు బోయపాటి శ్రీనుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు నిర్మాణం సంస్థ ద్వారక క్రియేషన్స్ కు కూడా విషెస్ ను తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇక ఇస్మార్ట్ హీరో రామ్ సైతం అఖండ విజయోత్సవం మీద స్పందిస్తూ ''అఖండ గురించి అద్భుతమైన స్పందన వినిపిస్తోంది..

  బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారికి, ద్వారకా క్రియేషన్స్, తమన్, ప్రగ్యా జైస్వాల్ అందరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమా వేవ్ మళ్లీ మొదలైంది అని ట్వీట్ చేశారు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ 'అఖండ మాస్ జాతర', నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి & హోల్ టీమ్‌కి అభినందనలు! థమన్ బావా, మీరు సంగీతం & BGM తో రచ్చ రేపావు, NBK107 కోసం సిద్ధంగా ఉండండి, లవ్ యూ అని పేర్కొన్నారు.

  తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు

  తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు

  ఇక సందీప్ కిషన్ స్పందిస్తూ అఖండ గురించి అద్భుతమైన విషయాలు విన్నాను, ఇండస్ట్రీకి మళ్లీ రిలీజ్ డే ఎనర్జీని అందించిన బాలకృష్ణ గారికి & బోయపాటి శ్రీను గారికి ధన్యవాదాలు, డార్లింగ్ థమన్, ప్రగ్యా & టీమ్ మొత్తానికి అభినందనలు అని పేర్కొన్నారు. దర్శకురాలు నందినీ రెడ్డి స్పందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఈరోజు అఖండ ఘనవిజయం సంబరాలు చేసుకుంటోంది. మా అద్భుతమైన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు & టీమ్ మొత్తానికి అభినందనలు అని పేర్కొంది.

  Recommended Video

  Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
  గేట్లు ఓపెన్ చేశారు

  గేట్లు ఓపెన్ చేశారు

  నారా రోహిత్ స్పందిస్తూ బాల మామ అఖండ, తీసి సినిమా థియేటర్లకు ఎంతో అవసరమైన కీర్తిని తీసుకొచ్చాడు. మా BB3 గురించి అద్భుతమైన నివేదికలు వినబడుతున్నాయి. రోరింగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించినందుకు మొత్తం టీమ్‌కి అభినందనలు అని పేర్కొన్నారు. ఇక నాచురల్ స్టార్ నాని ట్వీట్ చేస్తూ " బాలకృష్ణ గారు గేట్లు ఓపెన్ చేశారు.. అఖండ టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్" అని తెలిపారు. వీరితో పాటు యంగ్ హీరోలు రామ్ పోతినేని, నిఖిల్ సిద్దార్థ్, సందీప్ కిషన్, నటుడు బండ్ల గణేష్, దర్శకులు గోపీచంద్ మలినేని, నందిని రెడ్డి, మంచు విష్ణు, మంచు లక్ష్మి తదితరులు అఖండ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

  English summary
  Akhanda Celebrities Review by mahesh babu, nani, ram and many others.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X