»   » హాట్ టాపిక్ : 'ఆగడు' కి శ్రీను వైట్ల రెమ్యునేషన్

హాట్ టాపిక్ : 'ఆగడు' కి శ్రీను వైట్ల రెమ్యునేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
11 crore package for Aagadu?
హైదరాబాద్ : మహేష్ బాబు చిత్రం రిలీజ్ కోసం అభిమానులే కాకుండా సామాన్య సినీ జనం సైతం ఆసక్తిగా చూస్తారు. 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇంతకీ శ్రీను వైట్లకు ఈ చిత్రం రెమ్యునేషన్ గా ఎంత ముట్టనుందనే విషయం ఇప్పుడు చర్చగా మారింది. సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నదాని ప్రకారం శ్రీను వైట్ల కు 11 కోట్లు ప్యాకేజి ఇచ్చారని తెలుస్తోంది.

అందులోనే రైటర్స్ రెమ్యునేషన్ కలిసి ఉంటుందని, దర్శకత్వం,రచన రెండింటికి కలిసి ప్రొడక్షన్ హౌస్ ఈ ప్యాకేజి ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. రైటర్స్ పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వారు కాకపోవటంతో గతంలోలా ఎక్కువ ఖర్చు దానిపై ఖర్చు పెట్టాల్సిన పనిలేదని అంటున్నారు. అంటే 10 కోట్లు వరకూ మిగిలినట్లే అని లెక్కలు వేస్తున్నారు. అయితే శ్రీను వైట్ల వంటి గ్యారెంటీ హిట్ ఇచ్చే డైరక్టర్ కి ఆ రెమ్యునేషన్ పెద్ద ఎమౌంట్ కాదనేది మాత్రం నిజం


''సినిమాలో అసలు సిసలు మాస్‌ మహేష్‌ని చూస్తారు. దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు. '' అని నిర్మాతలు తెలిపారు. సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్‌ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు

గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. ఇప్పటికే ఓసారి మహేష్ బాబుతో సుకుమార్ సినిమాలో చేసే అవకాశం రాగా...డేట్స్ ప్రాబ్లం వల్ల చేజార్చుకున్న తమన్నా ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరుగకుండా డేట్స్ విషయలో జాగ్రత్త పడుతోంది. దూకుడు సినిమాను మహేష్ బాబు ఇమేజ్‌కు తగిన విధంగా పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందించిన శ్రీను వైట్ల....'ఆగడు' స్క్రిప్టు తన గత సినిమాలకు వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Grapevine is that Srinu Vytla is being paid a package deal of whopping Rs. 11 Crore for script and direction of Aagadu. This deal includes the remuneration of writers too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu