»   »  ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ ఆపుతారా?

‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ ఆపుతారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రం కి ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 14 రీల్స్ వారు...తమకు ప్రకాష్ రాజ్ వెనక్కి రెమ్యునేషన్ తిరిగి చెల్లించేవరకూ వేరే షూటింగ్ లకు హాజరు కాకుండా ఆపాలని ఫిల్మ్ ఛాంబర్ ని కోరినున్నట్లు సమాచారం.

ఆగడు షూటింగ్ నుంచి ప్రకాష్ రాజ్ వివాదంతో తప్పుకోవటంతో అందు నిమిత్తం ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతునట్లు తెలుస్తోంది. దాంతో ప్రకాష్ రాజ్ హాజరుకావాల్సిన 'గోవిందుడు అందరివాడేలే' షూటింగ్ పై ఆ ఎఫెక్టు పడే అవకాసముందని అనుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ సమాచారమూ లేదు. మరో ప్రక్క ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదిన విడుదల చేయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం.

14 Reels want to stop ‘Govindudu Andari Vadele’?

నిర్మాత మాట్లాడుతూ ''ఈ షెడ్యూల్‌లో కుటుంబ సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. అనంతరం లండన్‌లో పాటల చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రకాష్‌రాజ్‌, జయసుధలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. యువన్‌ శంకర్‌రాజా ఇప్పటికే మూడు పాటల్ని రికార్డ్‌ చేశారు''అన్నారు.

రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మార్పు కొత్తగా వచ్చింది. ఇంతకు ముందు ఈ పాత్రకు గానూ రాజ్ కిరణ్ ని అనుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ తీసుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు కి కారణం చిరంజీవి అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

తన కుమారుడు తాజా చిత్రంపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ మార్పుతో శ్రీకారం చుట్టాడని అంటున్నారు. అంతేకాక కథలో సైతం కొన్ని మార్పులు చేయబోతున్నారని చెప్తున్నారు. గతంలోనూ నాయక్,రచ్చ, ఎవడు చిత్రాల విషయంలో చిరంజీవి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని, అవి విజయం సాధించటంతో ఈ సారి కూడా ఈ సినిమాని పూర్తిగా పర్యవేక్షించనున్నారని సమాచారం. ఈ మేరకు చేసిన సూచనలలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఒకటని చెప్పుకుంటున్నారు.

''సినిమాలో ప్రకాష్‌రాజ్‌ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. తొలుత ఈ పాత్ర కోసం తమిళనటుడు రాజ్‌కిరణ్‌ను ఎంపిక చేశాం. అయితే ఈ పాత్రకు ప్రకాష్‌రాజ్‌ అయితే బాగుంటారని ఆయన్ని తీసుకున్నాం. రామ్‌చరణ్‌కు అనారోగ్యం వల్ల సినిమాను వాయిదా వేశాం. త్వరలో షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది'' అని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. . ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి ప్రకాష్ రాజ్ తో తిరుగుతూ కనిపిస్తాడు.

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
14 Reels producers are planning to approach producer’s council to stop shooting of Kajal and Prakash Raj films until they payback the remuneration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu