»   » చిరుకు కొత్త తలనొప్పి,పదేళ్ల క్రితమే 150 వ చిత్రం

చిరుకు కొత్త తలనొప్పి,పదేళ్ల క్రితమే 150 వ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ ప్రక్క చిరంజీవి తన 150 వ చిత్రం ప్రారంభానికి జోరుగా ఏర్పాట్లు చేసుకుంటూంటే ఆయనకు ఓ కొత్త తలనొప్పి ఎదురౌతోంది. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో...ఆయన చేసేది 150 వ చిత్రం కాదంటూ అది 151 వ చిత్రం అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆల్రెడీ బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి కనిపించారని, అది 150 వ చిత్రం అయ్యిందని, ఇప్పుడు చేసేది 151 వ చిత్రం అంటూ చిరంజీవి లెక్కలు మర్చిపోయారంటూ పోస్ట్ లు పెడుతున్నారు. దానికి మెగా ఫ్యాన్స్ ఓ రేంజిలో రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ కు, యాంటి ఫ్యాన్స్ కు మధ్య యుద్దం జోరు అందుకుంది.

అయితే గెస్ట్ రోల్ లు ఎలా అసలు కౌంట్ లో కలుపుతాం అంటున్నారు. అలా కలపాల్సి వస్తే ఇప్పటికే ఏడు,ఎనిమిది సార్లు చిరంజివి గెస్ట్ గా కనిపించారు కాబట్టి వాటిని కూడా కలిపి లెక్క వెయ్యాలి అంటున్నారు. అప్పుడు ఆల్రెడీ చిరంజీవి 150 వ చిత్రం పదేళ్ల క్రితమే చేసినట్లు అవుతుంది అంటున్నారు.

 150th: Mega Star Chiranjeevi confusion on milestone number

అలా యాంటి ఫ్యాన్స్ కావాలని కన్ఫూజ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. దానికి కొందరు మెగా ఫ్యాన్స్..ఏనుగు వెళ్తూంటే కుక్కలు మొరుగుతాయి..ఏనుగు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఫేస్ బుక్, ట్విట్టర్ లో దారుణంగా కామెంట్ యుద్దాలు జరుగుతున్నాయి.

వాటిలో కొన్ని చిరంజీవి సన్నిహితుల ద్వారా..ఆయనకు చేరాయి అంటున్నారు. ఇటువంటి ప్రచారాలు ఎంత త్వరగా ఆపగలిగితే అంత మంచిది అని ఆయన చెప్పినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూడాలన్న మెగా అభిమానుల కోరిక త్వరలో నెరవేరబోతున్న సంగతి తెలిసిందే. చిరు హీరోగా నటించనున్న 150వ చిత్రానికి రంగం సిద్ధమైనా ప్రారంభం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సగటు అభిమాని ఆశ తీరబోతోంది.

తమిళంలో విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరు తాజా చిత్రాన్ని ప్రారంభించేందుకు ఈనెల 29న మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రస్తుతం 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నారు.

మరో ప్రక్క...చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు, నటుడు వరుణ్‌తేజ్‌తో కలిసి ఒక ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోలో చిరు, వరుణ్‌తేజ్‌ ఇద్దరు కలిసి తమ చేతి వేళ్లను 150 ఆకారం వచ్చేలా అమర్చారు.

వరుణ్‌తేజ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ... చిరు 150కి రెడీగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Now in social Media speculation is on whether the film is Chiru's 150th. By their logic as Chiru did special role in ‘Bruce Lee’,he already completed 150th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu