twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారిపై కేసు వేశారా? రోబో ‘2.0’ రిలీజ్ ఆలస్యానికి కారణం అదేనా?

    By Bojja Kumar
    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న '2.0' సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తామని చెప్పిన నిర్మాతలు పలు కారణాలతో సినిమాను ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాక పోవడమే. ఈ వ్యవహారానికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

     వారిపై కేసు వేసిన నిర్మాతలు

    వారిపై కేసు వేసిన నిర్మాతలు

    రోబో ‘2.0' సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అమెరికాలోని ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలో జరుగుతోంది. అయితే అనుకున్న సమయానికి వారు పని పూర్తి చేయలేదు. తాము ఓ వైపు సినిమా రిలీజ్ పెట్టుకుంటే వారు ఇలా నిర్లక్ష్యం చేయడంతో..... సదరు కంపెనీపై నిర్మాతలు కేసు వేసినట్లు సమాచారం. పని పూర్తికాక పోవడం, ఈ కేసు కూడా నడుస్తుండటంతో రోబో 2.0 చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదని అంటున్నారు.

     ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ రిలీజ్

    ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ రిలీజ్

    తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోందని, ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేశారు.

     భారీ తారాగణం

    భారీ తారాగణం

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

     ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్

    ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్

    2.0 సినిమా ఇండియాలోనే ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    English summary
    The buzz is that The makers of 2.0 have apparently handed over the work to a VFX company based in the USA but the company officials have failed to deliver the output on time resulting in the makers filing a case on them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X