»   » రజనీ ‘2.0’... ఈ విషయం వింటే షాకే, 450 కోట్లు ఖర్చు పెట్టి ఇంతేనా?

రజనీ ‘2.0’... ఈ విషయం వింటే షాకే, 450 కోట్లు ఖర్చు పెట్టి ఇంతేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఈ విషయం వింటే షాకే ! మరీ అంత తక్కువ ?

గతేడాది భారత దేశ ప్రజలంతా 'బాహుబలి-2' కోసం ఎంతలా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత 2018లొ ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '2.0'. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అందరిలోనూ ఆసక్తి

అందరిలోనూ ఆసక్తి

రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా రూ. 450 కోట్ల ఖర్చుతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన 2.0 చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ విషయం తెలిసి షాకవుతున్న అభిమానులు

ఈ విషయం తెలిసి షాకవుతున్న అభిమానులు

‘2.0' మూవీ రన్ టైమ్ తెలిసి అభిమానులు షాకవుతున్నారు. ఇండియన్ ప్రేక్షకులకు సినిమా కనీసం రెండున్న గంటలు ఉంటే తప్ప చూసినట్లు ఉండదు. ఒకప్పుడు 3 గంటలు సినిమా ఉండేదు. ఇప్పుడు అన్నీ దాదాపు రెండున్నర గంటలకు తక్కువ కాకుండా సిమాలొస్తున్నాయి. ఎప్పటి నుండో మనం ఈ పార్మాట్ కు అలవాటు పడ్డాం. అయితే ‘2.0' మూవీ రన్ టైమ్ 2 గంటలు కూడా ఉండటం లేదని సమాచారం.

మరీ ఇంత తక్కువ రన్ టైమ్?

మరీ ఇంత తక్కువ రన్ టైమ్?

2.0 మూవీ రన్ టైమ్ కేవలం 100 నిమిషాలే అని తెలుస్తోంది. అంటే దాదాపు గంటన్నర. హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇంత తక్కువ రన్ టైమ్ తో ఉంటాయి. హాలీవుడ్ స్థాయిలో సినిమా తీస్తున్నట్లు చెప్పిన దర్శకుడు శంకర్.... సినిమా నిడివి విషయంలో కూడా హాలీవుడ్ నే ఫాలో అయినట్లు ఉన్నారు.

పాటలు లేక పోవడం వల్లేనా?

పాటలు లేక పోవడం వల్లేనా?

సాధారణంగా భారతీయ సినిమాల్లో పాటలు ఉంటాయి. అయితే రోబో 2.0 లో ప్రత్యేకంగా పాటలు ఉండక పోవడం వల్లనే రన్ టైమ్ ఇంత తక్కువగా వచ్చినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా రూ. 450 కోట్లు ఖర్చు పెట్టి ఇంత తక్కువ రన్ టైమ్ ఏమిటి? అంటూ ప్రేక్షకులు ఆశ్చర్య పోతున్నారు.

అందుకే ఆలస్యమా?

అందుకే ఆలస్యమా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న '2.0' సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తామని చెప్పిన నిర్మాతలు పలు కారణాలతో సినిమాను ఏప్రిల్ చివరి వారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రోబో ‘2.0' సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ అమెరికాలోని ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలో జరుగుతోంది. అది లేటు కావడం వల్లనే సినిమా లేటయిందని తెలుస్తోంది.

ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ రిలీజ్

ఎట్టిపరిస్థితుల్లోనూ ఏప్రిల్ రిలీజ్

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోందని, ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేశారు.

భారీ తారాగణం

భారీ తారాగణం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్

2.0 సినిమా ఇండియాలోనే ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

English summary
As soon as the post production works are also completed 2.O will go to the censor certification in Telugu, Tamil, Hindi and Arabic languages. As per the latest flash, the runtime of the movie is going to be 100 minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X