»   » 200% టేబుల్ ప్రాఫిట్: సర్దార్లో...పవన్ వాటా ఎన్నికోట్లు?

200% టేబుల్ ప్రాఫిట్: సర్దార్లో...పవన్ వాటా ఎన్నికోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు.... సహ నిర్మాతగా, రచయితగా పలు బాధ్యతలు చేపట్టారు పవన్. ఈ నేపథ్యంలో ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్‌కు దక్కే వాటా ఎంత? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

యాక్షన్ కామెడీ చిత్రంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో దీనికి సీక్వెల్ గా వస్తున్న ఈచిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ చిత్రానికి స్క్రిప్టు కూడా పవన్ కళ్యాణే అందించడం.


కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని తన స్నేహితుడు శరత్ మరార్ తో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. ఈ సినిమా బడ్జెట్ మొత్తం రూ. 30 కోట్లు(పవన్ రెమ్యూనరేషన్ లేకుండా) అయినట్లు తెలుస్తోంది.


ఆల్రెడీ ఈ సినిమాకు రూ. 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ భారీ మొత్తానికి ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈరోస్ సంస్థ ఈ సినిమాను ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మే పనిలో బిజీగా ఉంది. మరో వైపు సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా బాగా డిమాండ్ ఏర్పడింది.


ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఈచిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 15 కోట్లకు దక్కించుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ కాకుండా మ్యూజిక్, డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 2 లేదా 3 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన మొత్తం రూ. 90 కోట్ల బిజినెస్ జరిగింది. స్లైడ్ షోలో పూర్తి వివరాలు.


30 కోట్లుకు... 90 కోట్ల రాబడి

30 కోట్లుకు... 90 కోట్ల రాబడి

పవన్, శరత్ మరార్ కలిసి రూ. 30 కోట్లలో సినిమా పూర్తి చేస్తే 90 కోట్ల ఆదాయం వచ్చింది.


టేబుల్ ప్రాఫిట్

టేబుల్ ప్రాఫిట్

అంటే 200% టేబుల్ ప్రాఫిట్ అన్నమాట.


పవన్ కళ్యాన్

పవన్ కళ్యాన్

అయితే ఈ సినిమాకు హీరోగా, రైటర్ గా, నిర్మాతగా మల్టిపుల్ బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ కు ఎంత వాటా వస్తుంది అనేది ఇంకా బయటకు రాలేదు.


ఆయనకు దక్కేది..?

ఆయనకు దక్కేది..?

లాభాల్లో 50% వాటా తీసుకున్నా రూ. 30 కోట్లు పవన్ కళ్యాణ్ కి దక్కడం ఖాయం అంటున్నారు.English summary
"Sardaar Gabbar Singh" is expected to earn approximately Rs 90 crore in its pre-release business. The makers of the movie are likely to get 200 percent table profit from the film before its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu