»   » బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రెండో పెళ్లి?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రెండో పెళ్లి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానె విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయానికి వచ్చారు. తాజాగా హృతి రోషన్ గురించి ఆసక్తికర వార్తలు బాలీవుడ్ సర్కిల్‌లో వినపడుతోంది. త్వరలోనే ఆయన రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువాల చెప్పిన వివరాల ప్రకారం హృతిక్ రోషన్ 2015లో రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ల విషయంలో గతంలో ఆయన చెప్పిన జోతిష్యాలు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ 2015లో రెండో పెళ్లి చేసుకుంటాడని ఆయన చెప్పిన వివరాలు చర్చనీయాంశం అయ్యాయి.

2nd marriage on cards for Hrithik Roshan?

17 ఏళ్ల ప్రేమ బంధం, 13 ఏళ్ల వివాహం బంధం......తెగిపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సుజానె విడిపోతున్నారు. తన భార్య తన నుండి డిపోవాలని కోరుకుంటోందని, తమ బంధం తెగిపోతోందని మీడియాకు వెల్లడించారు హృతిక్.

అయితే హృతిక్‌తో విడిపోవడానికి కారణమేంటో చెప్పడానికి సుజానె నిరాకరించింది.'కొన్ని సార్లు ఎలాంటి కారణాలు ఉండవు. కొన్ని అనుకోకుండా జరుగుతాయి. దీని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు' అని సుజానె వెల్లడించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని సుజానె పేర్కొన్నారు. తాము విడిపోవడానికి అర్జున్ రాంపాల్ కారణమనే వార్తలను ఆమె ఖండించారు.

చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. ఇప్పుడు సుజానె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారు.

English summary
Bejan Daruwalla is a popular Indian astrology columnist. Daruwala, a big believer in the powers of Ganesha, sees a possible second marriage for Hrithik in 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu