»   » ఈ ఏడాది ఐశ్యర్య రాయ్ చిత్రాల విలువ 300 కోట్లకు పైగా!

ఈ ఏడాది ఐశ్యర్య రాయ్ చిత్రాల విలువ 300 కోట్లకు పైగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఐశ్వర్యరాయ్ చిత్రాల విలువ దాదాపు 300కోట్లని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ నటించిన నాలుగు భారీ చిత్రాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గత సంవత్సరం ఐశ్వర్యరాయ్ నటించిన హాలివుడ్ చిత్రం 'పింక్ పాంథర్" మాత్రమే విడుదలయింది.

అయితే ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'రావణ్" చిత్రంలో అభిషేక్ బచ్చన్ తో, శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'రొబో" లో రజనీకాంత్ తో కలసి నటిస్తోంది. ఇక హిందీ చారిత్రక నేపథ్య కథాంశంతో రూపొందుతున్న 'యాక్షన్ రీప్లే" చిత్రంతో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న 'గుజారిష్" చిత్రంలో హృతిక్‌రోషన్‌తో కలసి నటిస్తోంది.

ఈ నాలుగు భారీ చిత్రాల షూటింగ్‌ లతో నిర్విరామంగా పనిచేయడంతో ఐశ్వర్య రాయ్ ఆ మధ్యన అస్వస్థకు లోనయిన విషయం తెలిసిందే. హిందీ, తమిళంలో రూపొందుతున్న ద్విబాషా చిత్రం 'రోబో" దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో, రావణ 45 కోట్లతో, యాక్షన్‌ రీప్లే 60 కోట్ల భారీ బడ్జెట్‌లతో తెరకెక్కుతున్నాయి.

'గుజారిష్‌ చిత్రాన్ని యుటివి సంస్థ దాదాపు 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం మీద ఈ ఏడాది విడుదల కావల్సిన ఐశ్యర్య రాయ్ చిత్రాల విలువ 300 కోట్లకు పైగా వుంటుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ చాలా కాలంగా ఆసక్తిని రేపుతూ ప్రముఖ దర్శకుల చేతిలో రూపొందుతుండటం విశేషం.

రామాయణ కథాంశానికి ఆధునిక తను జోడించి రూపొందిస్తున్న 'రావణ్‌" చిత్రంలో ఐశ్వర్య సీతగా కనిపించనుంది. ఇక 'యాక్షన్‌ రీప్లే" 1950 దశకంలో గుజరాత్‌ నేపథ్య కథాంశంతో రూపొందుతుంది. సంజయ్ లీలా భన్సాలీ 'గుజారిష్‌ చిత్రంలో వివాహిత నర్సు పాత్రలో అరుదైన వ్యాధిలో బాధ పడే కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ ప్రేమలో పడే యువతి పాత్రను చేస్తోంది. ఇన్ని భిన్న కథాంశాలతో రాబోతున్న ఐశ్వర్య రాయ్ చిత్రాల కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనడంతో సందేహం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu