»   » సినిమాలో అంతా బూతు, చండాలమే: మహిళలు కూడా ఛీ కొట్టారట!

సినిమాలో అంతా బూతు, చండాలమే: మహిళలు కూడా ఛీ కొట్టారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా' చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫిరెట్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. మహిళా దర్శకురాలు అలకృత శ్రీవాస్తవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ ఝా నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని నిరాకరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.

  స్త్రీ వాద సినిమా కావడం వల్లేనే ఈ సినిమాపై వివక్ష చూపుతున్నారనే వాదనను.... సెన్సార్ బోర్డ్ సీఈఓ అనురాగ్ శ్రీవాస్తవ్ ఖండించారు. రెండు కమిటీలు సినిమాను చూసాయి. సినిమాను చూసిన వారిలో ఐదుగురు స్త్రీలు కూడా ఉన్నారు. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వొద్దని ఆ ఐదుగురు కూడా సిఫారసు చేసారు అని తెలిపారు.

  సినిమాలో సెక్సువల్ సీన్లు, అశ్లీల పదజాలం, ఆడియో ఫోర్నోగ్రఫీ, ఓ వర్గాన్ని కించపరిచేలా సీన్లు ఉండటం వల్లనే..1 ఎ, 2 (7, 9, 10, 11, 12), 3 ఎ ప్రకారం సర్టిఫికెట్ నిరాకరించినట్లు సెన్సార్ బోర్డ్ తేల్చి చెప్పింది.

  ప్రకాష్ ఝా

  అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని రిజెక్ట్ చేయడంపై ప్రకాష్ జా తీవ్రంగా స్పందించారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దేశం ప్రోత్సహిస్తుంటే అసౌకర్యమైన కథలంటూ సినిమా తీసేవారిని సెన్సార్ బోర్డ్ నిరుత్సాహానికి గురిచేస్తుందని ఆయన మండి పడ్డారు.

  పితృస్వామ్యాన్ని ఛాలెంజ్ చేయడం వల్లే

  పితృస్వామ్యాన్ని ఛాలెంజ్ చేయడం వల్లే

  దర్శకురాలు అలంకృత‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ... ‘పితృస్వామ్యాన్ని ఛాలెంజ్ చేస్తూ మహిళలు తమ స్వరం వినిపించే ఒక శక్తివంతమైన స్త్రీవాద సినిమా. అందుకే వారు సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారని భావిస్తున్నాను. ఒక ఫిల్మ్ మేకర్ గా నేను కథ తరుపున చివరి వరకు పోరాడతాను' అని తెలిపారు.

  ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు

  ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు

  గ్లాస్గో చిత్రోత్సవంలో ఫిబ్రవరి 24 ప్రదర్శితమైన ఈ సినిమా పలువురి ప్రశంసలు పొందినట్లు దర్శకురాలు అలంకృత‌ శ్రీవాస్తవ వెల్లడించారు. అలాగే ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో లింగసమానత్వంలో ఉత్తమ చిత్రంగా ఆక్సోఫామ్ అవార్డుతోపాటు టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పిరిట్ ఆఫ్ ఆసియా ప్రైజ్ గెలుపొందినట్లు ఆమె తెలిపారు.

  ముఖ్య పాత్రలు

  ముఖ్య పాత్రలు

  లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా చిత్రంలో కొంకణాసేన్ శర్మ, రత్నపాఠక్‌ షా, అహానా కుమ్రా, ప్లబితా బోర్తాకూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. స్వచ్ఛ కావాలని కోరుకునే నలుగురు మహిళల చూట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

  English summary
  The Central Board of Film Certification refused to give a censor certificate to film Lipstick Under My Burkha by director Alankrita Shrivastava. CEO of the CBFC, Anurag Shrivastav himself has not seen the film in question, but he says that there were two committees who saw Lipstick Under My Burkha. "The censor board guidelines say that half the members of the viewing committee and even the revising committee should be women. But instead of four, we had five women watching the film. All of them felt that the film could not be given a certificate under the Cinematograph Act (1952) and the decision was unanimous."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more