»   » బిగ్ బాస్: ఇంట్రస్టు చూపని మహేష్ బాబు, చాలా మంది ఉన్నారన్న ఎన్టీఆర్?

బిగ్ బాస్: ఇంట్రస్టు చూపని మహేష్ బాబు, చాలా మంది ఉన్నారన్న ఎన్టీఆర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Mahesh babu Say "No" To The NTRబిగ్ బాస్ కి నో చెప్పిన మహేష్ బాబు

తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనంలా దూసుకెలుతున్న రియాల్టీ షో 'బిగ్ బాస్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేస్తుండటం కూడా బాగా కలిసొచ్చింది. తారక్ వాక్ చాతుర్యం, ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్లే హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయనే వాదన కూడా ఉంది.

70 రోజుల పాటు జరిగే ఈ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో షో ముగియబోతోంది. తొలి సీజన్ తెలుగు బిగ్ బాస్ షోలో ఎవరు గెలుస్తారు? అనే ఆసక్తి, ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. మరో వైపు తొలి సీజన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.

పెద్ద స్టార్ కోసం....

పెద్ద స్టార్ కోసం....

బిగ్ బాస్ గ్రాండ్ పినాలే సమయంలో ఎన్టీఆర్‌తో పాటు మరో బిగ్ స్టార్‌‌ను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లోకి తాప్సీ, రానా, అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ లాంటి వారు ఎంటరై తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇంట్రస్టు చూపని మహేష్ బాబు

ఇంట్రస్టు చూపని మహేష్ బాబు

ఈ నెలాఖున మహేష్ బాబు నటించిన ‘స్పైడర్' మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌కు మహేష్ బాబును ఆహ్వానించాలని నిర్వాహకులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు, తమిళంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న మహేష్ బాబు వచ్చేందుకు ఇంట్రస్టు చూపలేదని తెలుస్తోంది.

చాలా మంది ఉన్నారన్న ఎన్టీఆర్

చాలా మంది ఉన్నారన్న ఎన్టీఆర్

మహేష్ బాబు ఇంట్రస్టు చూపక పోవడంతో.... ఇంకా తెలుగులో చాలా మంది స్టార్స్ ఉన్నారు. వారిని సంప్రదించి చూడండి అని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలోనే బిగ్ బాస్ తొలి సీజన్ ముగింపు వేడుకలు చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజేత ఎవరో?

విజేత ఎవరో?

బిగ్ బాస్ విజేత ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో అర్చన, హరితేజా, ఆదర్శ్, దీక్షా ఉన్నారు. వీరిలో ఆదర్శ్, దీక్షా ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ వీరిద్దరూ బయటకు వెళితే బిగ్ బాస్ ఫైనల్ వారంలో నవదీప్, శివబాలాజీ, అర్చన, హరితేజా మిగులుతారని అంతా భావిస్తున్నారు. ఈ నలుగురిలో విజేత ఎవరు అనేది ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే నిర్ణయించనున్నారు.

ముందు నుండి అనుమానాలు

ముందు నుండి అనుమానాలు

బిగ బాస్ షోలో ఎలిమినేషన్స్ విషయంలో, ఓటింగ్ విషయంలో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగడం లేదని, ప్రతి ఓటును ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని, ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతోందని..... ఎన్టీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు.

ఎన్టీఆర్ తప్ప మరొకర్ని ఊహించలేం

ఎన్టీఆర్ తప్ప మరొకర్ని ఊహించలేం

తొలి సీజన్ బిగ్ బాస్ ఇంత సక్సెస్ కావడానికి కారణం ఎన్టీఆరే మాత్రమే అనేది చాలా మంది వాదన. ఎన్టీఆర్ కంటే బాగా మరెవరూ ఈ షోను హోస్ట్ చేయలేరని, అంత చాకచక్యంగా, టైమింగుతో షోను హోస్ట్ చేయడం ఇతర ఏ తెలుగు హీరో వల్ల కాదని అంటున్నారు.

రెండో సీజన్లో కూడా ఎన్టీఆరే

రెండో సీజన్లో కూడా ఎన్టీఆరే

బిగ్ బాస్ రెండో సీజన్లో పోటీ దారులు మారినా..... హోస్ట్ మాత్రం ఎన్టీఆరే కొనసాగుతారని తెలుస్తోంది. ఒక వేళ ఎన్టీఆర్‌ను మారిస్తే సక్సెస్ రేటు, టీఆర్పీ రేటింగులు తగ్గిపోయే అవాకశం ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ నిరంతరాయంగా కొనసాగుతున్నట్లే తెలుగులో ఎన్టీఆర్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

సెప్టెంబర్ 24 కోసం ఎదురు చూపులు

సెప్టెంబర్ 24 కోసం ఎదురు చూపులు

సెప్టెంబర్ 24వ తేదీతో బిగ్ బాస్ సీజన్ ముగియబోతోంది. తొలి బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరు? అనేది సమయం కోసం బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

English summary
On September 24, NTR will bid adieu to the first season of the Bigg Boss show and announce the winner. The makers want the show to end with a bang and they have decided to rope in a big star for the grand finale.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu