»   » హాట్ టాపిక్: డైరక్టరే మహేష్ కు విలన్ మారాడు...అందుకే

హాట్ టాపిక్: డైరక్టరే మహేష్ కు విలన్ మారాడు...అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, ఎఆర్ మురగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళంలో రానుంది. ఇందులో మహేష్ కి విలన్ గా...మహేష్ తో గతంలో విలన్ గా చేసిన ఓ దర్శకుడు చేస్తున్నారని సమాచారం. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. మరో ప్రక్క మహేష్ కు సన్నిహితుడు గతంలో టక్కరి దొంగ చిత్రం డైరక్ట్ చేసిన జయింత్ సి పరాంన్జీ అని తెలుస్తోంది.

మహేష్ కు జంటగా పరిణీతి చోప్రా, సాయి పల్లవి, కీర్తీ సురేశ్‌లలో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు నటించనున్నారు అన్న విషయమై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఠాగూర్‌ మధు నిర్మాత. అయితే ఇది తెలుగు, తమిళ చిత్రం కాబట్టి మురగదాస్‌ సాయి పల్లవి, కీర్తీలలో ఒకరిని ఎంపికచేయనున్నట్లు సమాచారం.

A director to play villain in Mahesh's next

ఇక పరిణీతి బాలీవుడ్‌ నటి కాబట్టి కాస్త అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి ఏప్రియల్ 14న లాంచింగ్ అన్నారు కానీ... పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది.

2016లో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు 'బ్రహోత్సవం' చూపించడానికి సిద్ధమవుతున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీతలు మహేష్‌ సరసన ఆడిపాడనున్నారు. వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
A director has been roped in to play the villain's role in director Murugadoss,Mahesh movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu