»   » కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు

కళ్యాణ్ రామ్ నెక్ట్స్ చిత్రం దర్శకుడు ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస ప్రాజెక్టులతో ఎప్పుడూ బిజీగా ఉండే కళ్యాణ్ రామ్ మరో సినిమా కమిటయ్యారు. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ హిట్ కొట్టి ఇప్పుడు గోపిచంద్ తో సౌఖ్యం రూపొందిస్తున్న ఎఎస్ రవికుమార్ చౌదరితో సినిమా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఎంటర్నైమెంట్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. రీసెంట్ గా వచ్చిన షేర్ చిత్రం నిరాశపరచటంతో ఈ సారి కథ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

A S Ravikumar Chowdhary to direct Kalyan Ram?

ఇక రవికుమార్ చౌదరి తాజా చిత్రం విషయానికి వస్తే...

ఆపదలో ఆదుకొనేవాడే ఆప్తుడు. మన సౌఖ్యం కోరుకొనే వాడే స్నేహితుడు. అలా స్నేహితుడిగా వచ్చి, ఆప్తుడిగా మారిన ఓ యువకుడి కథే 'సౌఖ్యం' అంటున్నారు గోపీచంద్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సౌఖ్యం'. రెజీనా హీరోయిన్. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు.

వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఇటీవల స్విట్జర్లాండ్‌లో మూడు పాటల్ని తెరకెక్కించారు. వచ్చే నెల 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్‌, కుటుంబ బంధాలతో సాగే చిత్రమిది. రామజోగయ్య శాస్త్రి రాసిన 'ఓనా సిండ్రెల్లా ముద్దొచ్చే ఏంజెల్లా', 'నాకేం తోచదే తోచదే' పాటలతో పాటు భాస్కరభట్ల రచించిన 'ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ' గీతాన్ని తెరకెక్కించాము''అన్నారు. సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

English summary
Ravi Kumar Chowdhary is now planning to do his next movie with hero Kalyan Ram Nandamuri whose recent film, Sher, bombed at the box-office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu