»   » హైదరాబాదీగా అమీర్‌ఖాన్.. సెల్యూట్.. మరో బయోపిక్!

హైదరాబాదీగా అమీర్‌ఖాన్.. సెల్యూట్.. మరో బయోపిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దంగల్ ఘన విజయంతో జోష్ మీద ఉన్న అమీర్ ఖాన్ తర్వాత చేయబోయే చిత్రంపై క్లారిటీ వస్తున్నది. ప్రతిష్ఠాత్మకంగా రూపొందబోయే ప్రముఖుడి బయోపిక్‌లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ నటించనున్నట్టు తెలుస్తున్నది. వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితంలోని కీలక అంశాలను బాలీవుడ్‌లో తెరెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాకేశ్ శర్మగా నటించడానికి అమీర్ ఖాన్ ఓకే చెప్పినట్టు సమాచారం.

 అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా రాకేశ్ శర్మ

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా రాకేశ్ శర్మ

అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ చరిత్ర సృష్టించారు. ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రాంలో భాగంగా 1984 ఏప్రిల్ 2వ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ హోదాలో రాకేశ్ శర్మ సోయజ్ టీ-11లో అంతరిక్షంలోకి ప్రయాణించారు. 1949 జనవరి 13న పాటియాలాలో జన్మించిన రాకేశ్ శర్మకు భాగ్యనగరంతో విడదీయలేని అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో పట్టబద్రులయ్యారు. ఆ తర్వాత తన 18 ఏట 1966లో ఎయిర్ ఫోర్స్‌లో క్యాడెట్ జాయిన్ అయ్యారు. అనంతరం 1966లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. 1970లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ గా చేరారు.

 ఇందిరాతో సారే జహాసే అచ్చా..

ఇందిరాతో సారే జహాసే అచ్చా..


అంతరిక్షంలో గడుపుతున్న సమయంలో రాకేశ్ శర్మతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మాట్లాడారు. ఆ సందర్భంగా అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా ఉంది అని అడిగితే.. అందుకు సమాధానంగా సారే జహాసే అచ్చా అని సమాధానమిచ్చారు.

రాకేశ్ సినిమా పేరు సెల్యూట్

రాకేశ్ సినిమా పేరు సెల్యూట్

అంతరిక్షంలో భారత జెండాను రెపరెపలాడించిన రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కె చిత్రానికి సెల్యూట్ అనే పేరు పరిశీలన ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ నిర్మిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల అమీర్ ఖాన్‌ను కలిసిన సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ను అందజేసినట్టు సమాచారం.

 2018లో సెట్ పైకి.. దర్శకుడు మహేశ్

2018లో సెట్ పైకి.. దర్శకుడు మహేశ్


ఈ చిత్రాన్ని ఆర్కే ఫిల్మ్స్ అనే కొత్త బ్యానర్‌పై నిర్మించే ఈ చిత్రం 2018లో సెట్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రానికి దర్శకుడు మహేశ్ మథాయ్ అని జాతీయ మీడియాకు చెందిన ఓ వెబ్ సైట్ వెల్లడించింది. భోపాల్ ఎక్స్‌ప్రెస్, బ్రోకెన్ థ్రెడ్స్ అనే చిత్రాలకు గతంలో మహేశ్ మథాయ్ దర్శకత్వం వహించారు.

 పొగట్‌గా అమీర్.. రికార్డు కలెక్షన్లు

పొగట్‌గా అమీర్.. రికార్డు కలెక్షన్లు


తాజాగా అమీర్ ఖాన్ కుస్తీ యోధుడిగా దంగల్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం హర్యానాకు చెందిన కుస్తీ వీరుడు మహావీర్ సింగ్ పోగట్, ఆయన కుమార్తెలు గీత, బబిత పొగల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అమీర్ మహావీర్ సింగ్ పాత్రను పోషించారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది.

 బిగ్ బీ తో థగ్స్ ఆఫ్ హిందోస్థాన్

బిగ్ బీ తో థగ్స్ ఆఫ్ హిందోస్థాన్


ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌తో కలిసి అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ధూమ్-3 చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యష్ రాజ్ బ్యానర్ పై రూపొందుతున్నది.

English summary
After sensational hit Dangal, Aamir Khan getting ready for another Biopic. Aamir Khan is all set to star in another biopic based on the astronaut Rakesh Sharma. He was the first Indian to fly into space.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu