twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్‌ఖాన్ మహాభారతం..ఒకటి కాదు.. ఐదు భాగాలు..రాజమౌళికి షాక్

    By Rajababu
    |

    బాహుబలి తర్వాత దర్శక ధీరుడు మహాభారతం చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. కానీ మహాభారతం చిత్రం ఇప్పుడే తీయలేను. కానీ ఆ చిత్రాన్ని తప్పుకుండా తెరకెక్కిస్తాను అని జక్కన్న వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అదే మహాభారతాన్ని అమీర్‌ఖాన్ తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం బాలీవుడ్‌లో ఓ సంచనల కథనం వెలుగులోకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే రాజమౌళి ప్రయత్నాలకు అమీర్‌ఖాన్ గండికొట్టినట్టే..

    Recommended Video

    SS Rajamouli opens up about his next film | Filmibeat Telugu
    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ తర్వాత

    ప్రస్తుతం అమీర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తైన తర్వాత మహాభారతం సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నట్టు తెలిసింది.

     ఆ చిత్రాలకు అమీర్ నో..

    ఆ చిత్రాలకు అమీర్ నో..

    మహాభారతం చిత్రాన్ని పలు భాగాలుగా తీసేపనిలో ఉన్నాడట అమీర్‌ఖాన్. అందుకోసమే రాకేశ్‌శర్మ చిత్రాన్ని వదులుకొన్నారట. అంతేకాకుండా మరే చిత్రాన్ని కూడా అంగీకరించడం లేదట. ఎంతో ఇష్టపడిన సెల్యూట్ చిత్రాన్ని కూడా అందుకే తిరస్కరించారనేది తాజా సమాచారం.

     మహాభారతం మూవీకి ప్లానింగ్

    మహాభారతం మూవీకి ప్లానింగ్

    తాజా సమాచారం ప్రకారం మహాభారతం ఐదు నుంచి ఆరు భాగాలు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట మిస్టర్ ఫర్‌ఫెక్ట్. ఈ చిత్రం మొదటి భాగానికి సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాన్ని రూపొందించిన అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తారట. మిగితా భాగాలకు స్వయంగా అమీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తారనేది లేటేస్ట్ న్యూస్.

     మహాభారతం తర్వాత అమీర్ గుడ్‌బై

    మహాభారతం తర్వాత అమీర్ గుడ్‌బై

    మహాభారతం చిత్ర అన్నిభాగాలను పూర్తి చేసిన తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలనే ఉద్దేశంతో అమీర్‌ఖాన్ ఉన్నట్టు మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రస్తుత అమీర్‌ఖాన్ వయసు 50 ఏళ్లకుపైనే. మహాభారతాన్ని ఆరు భాగాలుగా తెరకెక్కిస్తే కనీసం ఓ ఎనిమిదేళ్లు పట్టిందనుకున్న అప్పటికీ 60 ఏళ్లకు దగ్గర్లో పడటం ఖాయం.

     పక్కా ప్లానింగ్‌తో అమీర్ ఖాన్

    పక్కా ప్లానింగ్‌తో అమీర్ ఖాన్

    సినిమాలను తెరకెక్కించే విషయంలో అమీర్‌ఖాన్‌ది విలక్షణమైన శైలి. పక్కాగా ప్లానింగ్ ఉంటుంది. అందుకే ఆయనను మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అంటారు. ఈ చిత్రం కోసం అమీర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారనేది బాలీవుడ్ పత్రికల కథనం.

    డబుల్ రోల్‌లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్

    డబుల్ రోల్‌లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్

    ఇక మహాభారతంలో అమీర్‌ఖాన్ పోషించే పాత్ర ఏంటంటే.. ఆయనకు ఇష్టమైన కృష్ణుడు పాత్రనేనట. అంతేకాకుండా కర్ణుడిగా కూడా మరో పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నాడట. దర్శకుడు రాజమౌళి మహాభారతాన్ని రూపొందిస్తే తనకు కృష్ణుడి పాత్రను పోషించాలని ఉంది అని మనసులో మాటను అమీర్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.

    రాజమౌళికి ఎదురుదెబ్బ

    రాజమౌళికి ఎదురుదెబ్బ

    కాగా రాజమౌళికి ముందే అమీర్‌ఖాన్ మహాభారతం రూపొందించడం జక్కన్నకు దెబ్బే. ఎందుకంటే ఒకసారి మహాభారతాన్ని అమీర్ తెరకెక్కించడం ప్రారంభమైతే.. మరో ఏడేళ్లు రాజమౌళి ఆగాల్సిందే. అప్పటి సినిమా పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది ఊహించడం కష్టమే కదా..

     ఎన్టీఆర్, చెర్రీతో జక్కన్న

    ఎన్టీఆర్, చెర్రీతో జక్కన్న

    మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ చిత్రాన్ని నభూతో నభవిష్యత్‌గా తెరకెక్కించడం నా లక్ష్యం అని చెప్పే రాజమౌళి ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మించే మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Bollywood Mr. Perfect Aamir Khan's latest movie is Thugs of Hindustan.After this movie, Aamir in trials of making Mahabhartam movie. This movie could be multiple sequels to part 1. Report suggest that First part would be directed by Secret Superstar director Advait Chandan. Later on Aamir Khan will handle the whole sequels. This is a shock for SS Rajamouli, who is in dream of making this project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X