»   »  సినిమాగా ఛోటా రాజన్‌ లైఫ్ స్టోరీ...డిటేల్స్

సినిమాగా ఛోటా రాజన్‌ లైఫ్ స్టోరీ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: గత కొద్ది రోజులుగా చీకటి సామ్రాజ్య అధినేత ఛోటారాజన్‌ మీడియాలో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఛోటా రాజన్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కించటానికి సన్నాహులు చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో బయోగ్రాఫికల్ ఫిల్మ్స్ కు మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు, బిజినెస్ ఉంటుంది.

ఛోటా రాజన్‌ ప్రాతలో అభిషేక్‌ బచ్చన్‌ నటించనున్నట్లు చెప్తున్నారు. ఎస్‌.హుస్సేన్‌ జైదీ రచించిన 'బైకుల్లా టు బాంకాక్‌' పుస్తకం ఆధారంగా గ్యాంగ్‌స్టర్స్‌, రాజకీయ అవినీతి అంశంపై సంజయ్‌ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

అయితే ఈ విషయమై అభిషేక్‌ బచ్చన్‌ కానీ సంజయ్‌ గుప్తా కానీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అన్నీ అనుకున్నట్లే జరిగితే అభిషేక్‌ బచ్చన్‌ని గ్యాంగ్‌స్టర్‌గా మరోసారి వెండితెరపై చూడొచ్చు. గతంలో 'యువ' సినిమాలో అభిషేక్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు.

Abhishek Bachchan to play Chhota Rajan in Sanjay Gupta's next

ఇక ...అండర్ వరల్డ్ డాన్ చిన్న పొరపాటుకు ఇప్పుడు జైలు గోడల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. చిన్న పొరపాటుతో ఎంతటి కరుడు గట్టిన మాఫియా డాన్ అయినా దొరికిపోతాడని ఛోటా రాజన్ ఉదంతం తెలియజేస్తోంది. పాస్‌పోర్టులో ఒక పేరు, అధికారులకు చెప్పింది మరో పేరు కావడంతో ఈ మాఫియా డాన్ కథకు తెరపడింది.

బాలి విమానాశ్రయంలో క్యూలో వున్న రాజన్‌ను ‘నీ పేరేమిటి' అని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడగడం, అతను ఏమాత్రం ఆలోచించకుండా తన అసలు పేరు చెప్పేయడంతో దొరికిపోయాడు. అప్పటికప్పుడే రాజన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలి విమానాశ్రయంలో అందరితోపాటే రాజన్‌కూడా క్యూలో నించున్నాడు.

అయితే ఇమ్మిగ్రేషన్ అధికారులకు అనుమానం రావడంతో అతన్ని ఆ క్యూ నుంచి బయటకు పిలిచి పేరు అడిగారు. తన పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జీ అని వెల్లడించాడు. కానీ పాస్‌పోర్టులో అతని పేరు మోహన్ కుమార్. దాంతో అధికారుల అనుమానం బలపడింది.

అతన్ని ఛోటా రాజన్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. ఎప్పుడైతే ఛోటా రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది అతని పేరునే అన్న విషయాన్ని ఇండోనేషియా అధికారులు ధ్రువీకరించుకున్నారు. అప్పట్నుంచి మొత్తం ఛోటా రాజన్‌ను గుర్తించే ప్రక్రియలు చేపట్టారు.

English summary
Abhishek Bachchan has been approached for a film to be made by director Sanjay Gupta but the actor is yet to take a call on it. The film reportedly titled “Ek Tha Gangster” is based on S Hussain Zaidi’s 2014 bestseller – ‘Byculla to Bangkok’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu