twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుడిగాడు’సెన్సార్ కు షాక్ ఇచ్చాడా??

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లరి నరేష్ తాజా చిత్రం సుడిగాడు రేపు (ఆగస్టు 24న) భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ జరిగింది. ఒకే టికెట్ పై వంద సినిమాలు అనే సబ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని కత్తెర్లు పెట్టిన అనంతరం U/A సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమాలమీద ప్యారెడీగా వచ్చిన ఈ చిత్రంలో సెన్సార్ పైన కూడా కొన్ని డైలాగులు ఉన్నాయని,అవి విన్న సెన్సార్ వారు షాక్ అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇది రూమరే అని కొందరు కొట్టిపారేస్తున్నారు.

    అయితే ఈ సినిమాలో సెటైర్లు కొన్ని సార్లు బూతులుగా కూడా మారాయని, హీరోల అబిమానులును ఉడికిస్తాయని అంటున్నారు. హీరోల మ్యానరిజంలపై,యాక్షన్ లపై ఈ సినిమా మొత్తం ప్యారెడీలతో నింపేసారని, అప్పటికి చాలా చోట్ల మ్యూట్ పెట్టారని అంటున్నారు. అయితే సినిమా రిలీజయితే కానీ నిజమెంత అనేది మాత్రం తెలియదు. 'ఒకే బబ్లుగమ్‌ ఎంతసేపు నములుతారు' , 'ఆ బూతులు ఏంటి అద్యక్షా..బూతులు వినపడుతున్నాయంటే ఇది మన అసెంబ్లీ అయ్యుంటది' , పైన తగిలితే పనికి రాకుండా పోతావ్ అనే మూడు డైలాగ్స్ కు మాత్రమే అభ్యంతరం చెప్పి డిలీట్ చేయమన్నారు. దానమ్మ, నీయమ్మ, ఆడు ఎక్కించుకున్నాడు, నీ యబ్బ, నీతల్లి, నీ అయ్య, కామ నాడులు, గుడి, గర్భగుడి తీసేయటమో లేక మ్యూట్ చేయటమే చేయమని చెప్పారు.

    ఇక అల్లరి నరేష్ కెరీర్లోనే ఎన్నడూ లేనంత గ్రాండ్ గా 500కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగు సినిమా హీరోలందరినీ ఇమిటేట్ చేయడం.. చాలా హిట్ సినిమాలకు పేరడీలు తీయడం.. ట్రైలర్స్ కు విశేషమైన స్పందన రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చింది. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్‌గా చేస్తోంది. . ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ ఉలగనాథ్, సంస్థ: అరుంధతి మూవీస్, నిర్మాత చంద్రశేఖర్‌.

    బిజినెస్‌ పరంగా...ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... చిన్న సినిమాలలోనే పెద్దదిగా మా చిత్రానికి ఓవర్సీస్‌ మార్కెట్‌లో మంచి హైప్‌ వచ్చింది. అను కున్న దానికన్నా ఎక్కువ ప్రింట్లు డిమాండ్‌ చేస్తు న్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఆంధ్రతోపాటు తమి ళనాడు, కర్నాటక, ఒరిస్సా, ముంబెైలతో పాటు ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్‌, మి డిల్‌ ఈస్ట్‌, లండన్‌, యు.కె.లాంటి చోట్ల ప్రపం చవ్యా ప్తంగా చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నా ం. ఖర్చుకు తగ్గట్లుగానే బిజినెస్‌ కూడా చాలా పెద్ద రేంజ్‌లో జరిగింది. ఈ చిత్రానికి కూచిబొట్ల వివేక్‌ అందించిన సహకారం మరువలేనిది.

    English summary
    ‘Sudigaadu’ has completed its censor formalities and the movie was given a U/A certificate. A glimpse at the censor certificate shows us that a total of 5 cuts were implemented in the film. ‘Sudigadu’ is gearing up for a massive release on August 24 and this will be the biggest release in the career of Allari Naresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X