»   »  ‘సర్దార్’లో బ్రహ్మీ పాత్ర పేరు,క్యారక్టరైజేషన్

‘సర్దార్’లో బ్రహ్మీ పాత్ర పేరు,క్యారక్టరైజేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్'ఈ నెల 8న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో చిత్రానికి సంభందించిన ఓ స్పెషల్ ఎలిమెంట్ బయిటకు వచ్చింది. చిత్రంలో బ్రహ్మీ క్యారక్టర్ హైలెట్ కానుందని సమచారం.

ఈ సినిమాలో బ్రహ్మానందం క్యారక్టర్ పేరు వెపన్ టైగర్. అతనో వెపన్స్ డీలర్. తన కష్టమర్స్ ని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూంటారు. చివర్లో పవన్ చేత దెబ్బ తింటాడు. బ్రహ్మీ, పవన్ మధ్య సన్నివేశాలు హైలెట్ అని చెప్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉగాది రోజున ఏప్రిల్ 8 న విడుదల అవుతున్న ఈ సినిమాకి సెన్సార్ యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మొదటిసారి హిందీ లో కూడా విడుదల చేస్తున్నారు.

About Brahmanandam character in‘Sardar Gabbar Singh’

భారతదేశం అంతటా కలిపి దాదాపు 800 ప్రింట్లతో హిందీ లో ఈ సినిమా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా కి బాబీ దర్శకత్వం వహిస్తుండగా పవన్ స్నేహితుడైన శరత్ మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

దర్శకుడు మాట్లాడుతూ...కథ విషయంలో పవన్ గారు, నేనూ ఇద్దరం పనిచేశాం. దర్శకుడిగా మాత్రం పవన్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనివ్వాలన్నది ఆయన ఎప్పుడూ ఫాలో అయ్యే సిద్ధాంతం. ఈ సినిమా విషయంలో మేకింగ్ పరంగా ఆయనెక్కడా ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పుకొచ్చారు.

English summary
Brahmi will be seen as Weapon Tiger and will trouble all his customers in ‘Sardar Gabbar Singh’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu