»   » ఆ పొరపాటు రిపీట్ కాకూడదనే ఎన్టీఆర్ స్వయంగా ...

ఆ పొరపాటు రిపీట్ కాకూడదనే ఎన్టీఆర్ స్వయంగా ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాన్నకు ప్రేమతో చిత్రానికి కలెక్షన్స్ కురుస్తున్నా...బడ్జెట్ ఎక్కువ కావటంతో పెద్ద లాభాలు కనపడవని ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. ఇది ఎన్టీఆర్ చెవిన పడిందో ఏమో...తన తాజా చిత్రానికి అలాంటి సమస్య రాకూడదని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అందుకే జనతా బడ్జెట్ చిత్ర నిర్మాతలు షూటింగ్ ని ఇతర దేశాల్లో పెడదామన్నా ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించి...హైదరాబాద్ సారధిలో సెట్ వేయిస్తున్నాడని సమాచారం. దాంతో చాలా భాగం ఈ సెట్లోనే షూటింగ్ జరుగుతుందని, బడ్జెట్ కంట్రోల్ లో ఉంటుందని భావిస్తున్నారు.

పాటలకు మాత్రం ఇతర దేశాలు వెళ్లాలని , ఆ మేరకు దర్శకుడు కొరటాల శివ తో సీన్స్ చర్చించి, బడ్జెట్ ని కంట్రోలు పెడుతున్నట్లు చెప్తున్నారు. దాంతో సినిమా నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. శ్రీమంతుడు చిత్రానికి అదే ప్లస్ అయ్యిందని, అందుకే కొరటాల శివతో సినిమా హ్యాపీ అంటున్నారు నిర్మాతలు.

About Jr NTR Janatha Garage Movie budget!


:ఎన్టీఆర్ హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ డారక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నిత్యమీనన్, సమంతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెల 10 నుండి ఆరంభం కావలసివుంది, కానీ వాయిదాపడింది.

గ్యారేజ్ కు సంబందించి సెట్ నిర్మాణం ఇంకా పూర్తికానందున ఫిబ్రవరి 25కు ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడినట్టు సమాచారం. మెహనలాల్ ఈ సినిమాలో మెదటి షెడ్యూల్ నుండే ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ పాల్గోనున్నాడు. ఇందులో లాల్ ది కీ రోల్ అని తెలుస్తోంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మెదలుపెట్టినట్టు దేవీశ్రీ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ సినిమాలు ఓఎవర్సీస్ లో రూ. 5 కోట్ల మించి అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. అయితే ‘జనతా గ్యారేజ్' చిత్రానికి మాత్రం రూ. 7 కోట్లు ఇస్తానని ఓ బయ్యర్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కు ఫాలోయిగ్ ఏ రేంజిలో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తారని, ఇందులో మెకానిక్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ లో కీలకపాత్రలో మెహన్ లాల్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కేరళనుండి మరో యంగ్ హీరో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఇతని పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు కేరళ స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్.

English summary
Junior NTR is taking care of budget of Janatha Garage movie which will be started on 25th February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu