అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ పెద్దలకు మాత్రమేనా?
హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకు సిద్దమైన ఈచిత్రం నిన్న(జూన్ 13) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
అయితే సెన్సార్ బోర్డు ఈచిత్రానికి ఏ రేటింగ్ ఇచ్చారు? అనే విషయాన్ని దర్శక నిర్మాతలు రహస్యంగా ఉంచుతున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసిందని, ఇప్పుడే ఈ విషయం బయట పెడితే సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు దూరమయ్యే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారని టాక్.
నిర్మాతలు స్వయంగా సెన్సార్ బోర్డు రేంటింగ్ వివరాలు వెల్లడించాల్సి ఉంది. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతీయ సినీ రంగ చరిత్రలో 3డిలో రూపొందిన తొలి కామెడీ చిత్రం ఇదేకావడం విశేషం. సునీల్, పోసాని ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.
రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











