»   » మహేశ్‌బాబు సినిమాపై పుకార్లు.. ఖండించిన చిత్ర యూనిట్

మహేశ్‌బాబు సినిమాపై పుకార్లు.. ఖండించిన చిత్ర యూనిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు మురుగదాస్, ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంపై పలు రూమార్లు రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సినిమా అనుకున్నంత మేరకు బాగా రాలేదన్న కారణంతో మళ్లీ రీషూటింగ్ చేస్తున్నారనే రూమర్ విస్తృ‌తంగా వ్యాప్తి చెందడంతో చిత్ర నిర్వాహకులు స్పందించారు. మహేశ్ సినిమాను రీషూట్ చేయడం లేదని స్పష్టం చేశారు.

 ప్రిన్స్ మహేశ్ అచీతూచీ

ప్రిన్స్ మహేశ్ అచీతూచీ

బాక్సాఫీస్ వద్ద బ్రహ్మోత్సవం ఘోర పరాజయం సినిమా తర్వాత ప్రిన్స్ మహేశ్ తన సినిమా విషయంలో అచీతూచీ అడుగువేస్తున్నారనేది టాలీవుడ్ వర్గాల టాక్. దాంతోనే బ్రహ్మోత్సవం తర్వాత మురుగుదాస్ సినిమా కోసం ప్రిన్స్ కొంచెం గ్యాప్ తీసుకొన్నారు. మురుగదాస్ చిత్రం ప్రారంభమైన తర్వాత శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్నది. ముంబై, గుజరాత్‌, తమిళనాడులో షూటింగ్ షెడ్యూళ్లను ప పూర్తి చేసుకొన్నది.

వియత్నాంలో ఫైట్స్

వియత్నాంలో ఫైట్స్

ప్రస్తుతం హాలీవుడ్ స్థాయిలో ఛేజింగ్ సన్నివేశాలను చిత్ర యూనిట్ వియత్నాంలో తెరకెక్కిస్తున్నది. ఈ ఫైటింగ్ సన్నివేశాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఛేజింగ్, ఫైట్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ ఫైటర్లు పనిచేస్తున్నట్టు సమాచారం.

జనవరిలోనే రీలీజ్ కావాల్సి..

జనవరిలోనే రీలీజ్ కావాల్సి..

వాస్తవానికి ఈ సినిమా జనవరిలోనే పూర్తి కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందని నిర్మాత వెల్లడించారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందని, అయితే అనుకున్నంత స్థాయిలో రాలేదని తిరిగి కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారనే రూమర్లు వచ్చాయి.

జూన్ 23న సినిమా విడుదల..

జూన్ 23న సినిమా విడుదల..

కాగా ఈ సినిమాను రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 23న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఈ నెల 14 తేదీన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

English summary
Director Murugadoss, Prince Maheshbabu movie's shooting in fast moving mode. There was rumours that Prince Mahesh is not happy over the way movies' output. So this film unit again shooting some scenes.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu