»   » మార్చిలో ప్రభాస్ పెళ్లట... జాతకాలు, ముహుర్తాలతో హడావిడి!

మార్చిలో ప్రభాస్ పెళ్లట... జాతకాలు, ముహుర్తాలతో హడావిడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలితో దేశవ్యాప్తంగా పాపులారిటీని పెంచుకొన్న ప్రభాస్ పెళ్లి గురించి చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అని, ప్రముఖ పారిశ్రామిక వేత్త మనవరాలితో మ్యారేజ్ జరుగబోతుంది అనే గాసిప్స్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి వార్తలు చాలా ఎక్కవగానే అయ్యాయి. తాజాగా తెరపైకి మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే

పెళ్లికి ఏర్పాట్లు చేయండి..

పెళ్లికి ఏర్పాట్లు చేయండి..

యంగ్ రెబల్ స్టార్ పెళ్లి చేయాలనుకొంటున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో మంచి ముహుర్తాలు ఉంటే చూడండి అని పెదనాన్న కృష్ణంరాజు పురోహితులను అడిగారు అనే ఒక వార్త ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతున్నది. ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు చెప్పారో లేదో కానీ కొందరు పురోహితులు ప్రభాస్ పెళ్లి జాతకాలు రాయడం, వాటిని వీడియోలుగా చిత్రీకరించిన యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం జరుగుతున్నది. అలాంటి వార్తలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ప్రభాస్ జీవితంలో కీలక మార్పులు

ప్రభాస్ జీవితంలో కీలక మార్పులు

ప్రభాస్ పెళ్లి గురించి పురోహితులు చెప్పిందేమిటంటే ‘ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రభాస్‌ వ్యక్తిగత జీవితంలో ఊహించిన మార్పులు జరుగుతాయి. 2018 ప్రథమార్థంలో కచ్చితంగా యంగ్ రెబల్‌స్టార్ ఓ ఇంటివాడు అవుతాడు. వచ్చే ఏడాది మార్చిలో ప్రభాస్‌ పెళ్లి ఘడియలు మొదలవుతాయి అని అని సదరు జ్యోతిష్కులు చెప్పుకొచ్చారు.

జ్యోతిష్కుల హడావిడి

జ్యోతిష్కుల హడావిడి

పురోహితులు, జ్యోతిష్కుల తీరు చూస్తుంటే... ‘ఆలూ లేదు, చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం' అనే సామెత గుర్తొస్తున్నది. పారిశ్రామిక వేత్త బీవీ రాజు మనవరాలికి, ప్రభాస్‌కు పెళ్లి కుదురనున్నాదా? లేదా అనుష్కను పెళ్లి చేసుకోంటారా? ప్రభాస్ పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ప్రపోజల్స్ చూస్తున్నారా అనే విషయాలు కొద్దిరోజులు ఆగితే స్పష్టమవుతాయి.

పెళ్లి మరికొన్ని నెలలు వాయిదా

పెళ్లి మరికొన్ని నెలలు వాయిదా

ఇవన్నీ పక్కనపెడితే బాహుబలి తర్వాత ప్రస్తుతం ప్రభాస్ దృష్టి అంతా సాహో మీదే ఉంది. సాహో పూర్తయ్యేంత వరకు పెళ్లి విషయాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ విదేశాలకు విహారయాత్రకు వెళ్లాడు. ఆ వెకేషన్స్ పూర్తయిన తర్వాత సాహో టీంతో కలుస్తాడు. ఈ చిత్ర షూటింగ్‌కే కొన్ని రోజులపాటు అంకితం కానున్నాడు యంగ్ రెబల్ స్టార్.

English summary
Rumours about prabas marriage viral in Internet. There is buzz that Prabhas family wants preparing prabhas to get married in march. Prabhas uncle Krishnam Raju asked astro pandits to look into muhurtams in march.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu