»   » ఎన్టీఆర్ బయోపిక్ లో ముఖ్యమంత్రి పాత్రలో మరాఠీ నటుడు!

ఎన్టీఆర్ బయోపిక్ లో ముఖ్యమంత్రి పాత్రలో మరాఠీ నటుడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR Biopic About To Cast A New Actor In Movie

నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా తానే స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ పేరుతో సినిమా రూపొందించబడుతోంది.

 ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్

స్వర్గీయ నందమూరి ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల తేజ ఆ సినిమా నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.

కీరవాణి సంగీతం

కీరవాణి సంగీతం

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా దర్శకత్వం బాధ్యతలను హీరో నందమూరి బాలకృష్ణే చేపట్టనున్నారు. త్వరలో మొదలు కాబోతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. బుర్రా సాయి మాధవ్ రచయితగా పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను 'ఆ నలుగురు' సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరాఠీ నటుడు

మరాఠీ నటుడు

తాజా సమాచారం మేరకు మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ళ భాస్కర్ పాత్రలో మరాఠీ నటుడు సచిన్ కేదేకర్ నటిస్తున్నట్లు సమాచారం. మరాఠీలో సచిన్ కేదేకర్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించడం జరిగింది. త్వరలో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

English summary
the biopic on late actor-politician NT Rama Rao titled NTR went on the floors at Ramakrishna Studios in Hyderabad. But some unknown reasons movie director teja came out from the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X