పుష్ప కోసం మరో హీరో.. ఆయన అయితేనే కరెక్ట్ అంటూ!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో పాటు ఆర్య, ఆర్య-2 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

రెండు భాగాలుగా రిలీజ్

రెండు భాగాలుగా రిలీజ్


ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో డి గ్లామర్ లుక్ లో కనిపిస్తుండడంతో సినిమా మీద అందరి దృష్టి సినిమా మీదనే కేంద్రీకృతమై ఉంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ముందు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే నిర్మాతలు కూడా ఖరారు చేసేశారు.

ఫాహద్ ఫాజిల్ వెనక్కి

ఫాహద్ ఫాజిల్ వెనక్కి


కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే ముందు ఫాహద్ ఫాజిల్ షూట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆయన డేట్స్ మళ్ళీ దొరకడం కష్టమని భావించి సుకుమార్ మరెవరూ షూట్ చేయకున్నా పుష్ప షూటింగ్ ఆగకుండా కంటిన్యూ చేశారు. అయితే కరోనా భయంతో షూట్ చేయడం తన వల్ల కాదని చెప్పి ఫహద్ ఫాసిల్ వెనక్కి వెళ్ళిపోయాడు.

రెండు రోజులు ఉంటే

రెండు రోజులు ఉంటే


నిజానికి రెండు రోజులు కనుక బన్నీ షూటింగ్ లో పాల్గొన్నట్లు అయితే బన్నీ ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ లో వచ్చే అన్ని సీన్స్ పూర్తి అయ్యేవి అని తెలుస్తోంది. ఇక అనసూయ, ఫహద్, సునీల్ కాంబినేషన్ లో కూడా కొన్ని సీన్స్ చేయాల్సి ఉంది. కానీ ఫహద్ ఫాసిల్ వెళ్లిపోవడంతో ఈ సీన్స్ కి కూడా బ్రేకులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరో హీరో కూడా

మరో హీరో కూడా


అయితే ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో మరో హీరో భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన మరెవరో కాదు నటుడు తరుణ్. బాలనటుడిగా ఉన్నప్పుడు అనేక హిట్స్ అందుకున్న ఆయన హీరోగా మారాక కూడా అనేక హిట్ సినిమాలు అందుకున్నారు. ప్రస్తుతానికి సినిమాలు లేని ఆయన ఈ సినిమా కోసం ఆయన గొంతు అరువు ఇవ్వనున్నారని అంటున్నారు.

Recommended Video

Blockbuster Mechanic Alludu చిత్ర విశేషాలు.. ఫస్ట్ వీక్ లోనే సాలిడ్ కలెక్షన్స్ || Filmibeat Telugu
అలా భాగం అవుతూ

అలా భాగం అవుతూ


మొన్ననే ఆహా ఓటీటీలో విడుదలైన అనుకోని అతిథి సినిమాలో నటుడు ఫహాద్ ఫాజిల్ కి తరుణ్ డబ్బింగ్ చెప్పారు. ఆ డబ్బింగ్ అద్భుతంగా కుదిరింది. అందుకే ఈ సినిమాలో కూడా ఫహద్ ఫాసిల్ పాత్రకు తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్న ఈ సినిమా ఈ ఆగస్టు 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి.



More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X