»   » ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్: వెంకటేష్ వేరు కుంపటి?

ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్: వెంకటేష్ వేరు కుంపటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్ ప్రస్తుతం వయసు పైబడటంతో గతంతో పోలిస్తే కాస్త స్లో అయ్యారనే చెప్పాలి. ఇప్పటి కుర్ర హీరోలతో పోటీపడలేని ఆయన తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తాజాగా వెంకటేష్ గురించి ఓ ఆసక్తిక వార్త వినిపిస్తోంది.

ఆల్రెడీ వెంకీ ఫ్యామిలీకి సంబంధించి భారీ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. మొదటి నుండి వెంకటేష్ నటుడిగా రాణిస్తూ ఉంటే.... రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు ఆయన సోదరుడు సురేష్ బాబు చూసుకుంటూ వస్తున్నారు. తాజాగా వెంకటేష్ సొంతగా ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఈవిషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

రామానాయుడు మరణం తర్వాత వెంకటేష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆస్తుల పంపకాలు జరిగి ఉంటాయని కొందరు అంటుండగా.... అలాంటిదేమీ లేదనే వాదన కూడా ఉంద. కొన్ని ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఒకే ఫ్యామిలో రెండు మూడు ప్రొడక్షన్ సంస్థలు ఉండటం సహజమే అంటున్నారు.

Actor Venkatesh to launch new production House?

మెగా ఫ్యామిలీలో అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్.... మంచు ఫ్యామిలీలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24ఫ్రేమ్స్ ఎంటర్టెన్మెంట్.... కృష్ణ-మహేష్ బాబు ఫ్యామిలీలో రెండేసి మూడేసి ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయి. ఇటీవల మహేష్ బాబు కూడా తన పేరుతో కొత్తగా ప్రొడక్షన్ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వెంకటేష్ ఏం చేస్తున్నారు?
'గోపాల గోపాల' చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యినా ఆయన కొత్త చిత్రం మొదలెట్టలేదు. దాంతో ఆయన అభిమానులు అంతా ఈ సైలెన్స్ ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ మద్యకాలంలో వెంకటేష్ ఎప్పుడూ ఇలా ఇంత గ్యాప్ తీసుకుని ఆలోచనలో పడి నిర్ణయం తీసుకోలేదు. రెగ్యులర్ గా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడకపోవటం మీడియాని సైతం ఆశ్చర్యంలో పడేసింది. ఇంతకీ వెంకీ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం...తన తండ్రి రామానాయుడు ఫిబ్రవరిలో చనిపోవడంతో, వెంకీ చాలా రోజులు సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లి వచ్చారు.

అలాగే ఆ సమయంలోనే రచయిత ఆకుల శివతో రాబోయే సినిమా స్క్రిప్టు డిస్కషన్‌లో వెంకటేశ్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఎలాంటి కథ, ఏ బ్యాగ్ డ్రాప్, ఎటువంటి పాత్ర లాంటి వివరాలు తెలియలేదు.

అలాగే... ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపించే వెంకటేశ్, ఈసారి బాగా గడ్డం పెంచుకుని కనిపిస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో తనయుడు అర్జున్ రామ్‌నాథ్‌తో కలిసి ఆ గెటప్‌లోనే సందడి చేశారు. ఈ గెడ్డం గెటప్ అంతా ఆ కొత్త సినిమా కోసమే అని అభిమానులు భావిస్తున్నారు.

ఆకుల శివ స్క్రిప్టుతో జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా వెంకీ కొత్త సినిమా మొదల వుతుందనేది ఫిలిమ్‌నగర్ టాక్. దర్శకుడు ఎవరనేది తెలియరావాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, Tollywood actor Venkatesh To Launch New Production House.
Please Wait while comments are loading...