»   » పాపం కోటిన్నర నష్టపోయిన భూమిక!?

పాపం కోటిన్నర నష్టపోయిన భూమిక!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

భూమికకి వ్యాపారం ఏమీ కలిసి వచ్చేటట్లు కనపడటం లేదు. తాజాగా ఆమె తను హీరోయిన్ గా చేసిన యాగం చిత్రంలో కోటిన్నర పెట్టుబడి పెట్టింది. అలాగే తన డేట్స్ ను కూడా మినిమం రేటుకు ఇచ్చింది. అందుకు ప్రతిగా చిత్రం ప్రమేషన్ లో పోస్టర్స్ లో డౌన్ టౌన్ ఫిల్మ్స్ సమర్పించు అని వేయించుకుంది. అయితే సినిమా హిట్టవుతుందని ఆశించిన ఆమెకు విడుదల చేయటమే కష్టంగా మారింది. పోనీ రిలీజైన తర్వాత అయినా కలెక్షన్స్ అదిరిపోతాయి అనుకుంటే రెగ్యులర్ నవదీప్ చిత్రాల ఫ్లాఫ్ లోనే ఇదీ కలిసిపోయింది. దాంతో తమ్ముడు దర్శకుడు అరుణ్ ప్రసాద్ తనకు చెప్పిన కథలో లోపముందా లేక తన జడ్జెమెంట్ లో సమస్యుందా అనే డైలమోలో పడింది. ఇక భూమిక తమ బ్యానర్ లో అనుష్క హీరోయిన్ గా ప్రారంభించిన తకిట తకిట కూడా ముందుకెళ్ళకుండా ఆగిపోయింది. మరో ప్రక్క ఆమె ప్రారంభించిన సినిమా మ్యాగజైన్ మాయాబజార్ ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే ఆ మధ్య తన భర్త ప్రారంభించిన మినిరిల్ వ్యాటర్ ప్లాంట్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవన్నీ చూస్తూంటే ఆమెకు నటన, ఆయన యోగానే చివరకు కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి. వాటిమీదే పూర్తి దృష్టి పెడితే మంచిదనేది ఆమె అభిమానులు,శ్రేయాభిలాషులు భావన.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X