»   » సమంతపై డైరెక్టర్ చేయిచేసుకున్నాడంటూ ప్రచారం!

సమంతపై డైరెక్టర్ చేయిచేసుకున్నాడంటూ ప్రచారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంతపై దర్శకుడు చేయిచేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటిస్తున్న ‘10 ఎన్రదుకుళ్ల' మూవీ డైరెక్టర్ విజయ్ మిల్టన్.. సమంతను కొట్టాడనే వార్త తమిళనాట గుప్పుమంది. ఈ విషయం విని సమంత అభిమానులు తొలుత షాకైనా... అసలు విషయం తెలిసిన తర్వాత కూల్ అయ్యారు.

సినిమా సెట్స్ లో జరిగిన సంఘటన వేరు, బయట ప్రచారం వేరు. ఓ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు వివరిస్తుండగా అనుకోకుండా ఆయన చేయి సమంతకు తగిలిందట. కొందరు ఈ విషయాన్ని వక్రీకరించి ప్రచారం చేసారు. దీంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. డైరెక్టర్ కూడా ఈ మ్యాటర్ పై క్లారిటీ ఇచ్చినా...ఈ ప్రచారం ఆగడం లేదు.

Actress Samantha Slapped By Director?

‘10 ఎన్రదుకుళ్ల' సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రం టీజర్ విడుదల ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్బంగా విక్రమ్ మాట్లాడుతూ.. ''విజయ్‌మిల్టన్‌ కథ చెబుతుంటే నిజంగా ఆశ్చర్యమేసింది. ఆయన తెరకెక్కిస్తున్నప్పుడు.. ఇలా కూడా చిత్రీకరించవచ్చా అనుకున్నా. నిజానికి చాలా వైవిధ్యమైన దర్శకుడాయన. నా కెరీర్‌లోనే భిన్నమైన చిత్రంగా ఇది ఆకట్టుకుంటుంది. కమర్షియల్‌ హంగులకు ఏమాత్రం కొదవుండదు. చిత్ర టీజర్‌ చూస్తేనే సినిమా టేకింగ్‌ గురించి అర్థమవుతుంది. ఇందులో పశుపతి, రాహుల్‌దేవ్‌, అభిమన్యు సింగ్‌ తదితరులు నటించారు. పలు ఛేజింగ్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి'అని తెలిపారు.

సమంత మాట్లాడుతూ...''తొలిసారిగా విక్రంతో నటిస్తున్నా. నిజానికి ఈ కార్యక్రమం కోసం పలురకాలుగా మేకప్‌ వేసుకుని వచ్చా. కానీ ఇక్కడొచ్చి చూస్తే.. విక్రం మీసమే ఈ కార్యక్రమానికి హైలెట్‌గా మారింది. ప్రతి అంశంలోనూ వైవిధ్యాన్ని కనబరిచే నటుడాయన. బయట ఇలా కనిపిస్తారేగానీ.. నటనలో ఓ శాడిస్ట్‌, ఉగ్రవాది కూడా! సెట్‌లో ఆయన నటనను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇక దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ కూడా షూటింగ్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు''అని సమంత తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మిస్తున్నారు.

    English summary
    Rumours of Samantha being slapped by the director are doing the rounds in the film circuit.
    Please Wait while comments are loading...