»   » ప్రభాస్ ‘సాహో’: అనుష్క స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఫైనల్?

ప్రభాస్ ‘సాహో’: అనుష్క స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఫైనల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి' ప్రాజెక్టు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను నేషనల్ స్టార్‌ను చేసింది. 'బాహుబలి' తర్వాత ఆయన నుండి మరో సినిమా ఎప్పుడొస్తుందా? అని తెలుగు అభిమానులతో పాటు ఇండియా వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ 'సాహో' గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా టాలీవుడ్, బాలీవుడ్... ఇలా అన్ని వుడ్లకు సంబంధించిన ప్రేక్షుకులు ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో ఎవరు అనే విషయంలో ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. మొదట అనుష్కను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు చేయడం లేదు.

సాహోలో బాలీవుడ్ బ్యూటీ

సాహోలో బాలీవుడ్ బ్యూటీ

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సాహో'లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఫైనల్ అయిందని, ప్రభాస్ సరసన సుజీత్ దర్శకత్వంలో చేసేందుకు ఆమె సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్‌గా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది.

Prabhas Saaho Movie Shoot Begins with Prabhas Anushka's Romance
అనుష్క కోసం ట్రై చేశారు కానీ..

అనుష్క కోసం ట్రై చేశారు కానీ..

బాహుమలితో ప్రభాస్-అనుష్క జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ‘సాహో' మూవీకి కూడా ఈ జంటనే కంటిన్యూ చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదు. సాహో యూనిట్ అడిగిన డేట్స్, అనుష్క కమిటైన వేరే సినిమాల డేట్స్ క్లాష్ అవుతుండటంతో వీలు కాలేదని సమాచారం.

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఫైనల్ అయినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. శ్రద్ధా కపూర్ మంచి అందగత్తె, టాలెంట్ కలిగిన హీరోయి, ప్రభాస్‌కు బాగా సెట్టవుతుందని అంటున్నారు.

సాహో

సాహో

సాహో సినిమాను రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్లో ప్రభాస్ తిరుగులేని హీరోగా ఎదుగుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుష్క ఎందుకు నో చెప్పింది

అనుష్క ఎందుకు నో చెప్పింది

అనుష్క బరువు పెరగడం వల్లనే ఆమెను పక్కన పెట్టినట్లు కొన్ని రోజులు క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం.... అనుష్కను సాహో మేకర్స్ పక్కన పెట్టలేదని, పలు కారణాలతో అనుష్కనే ఈ సినిమా చేయడానికి నో చెప్పిందని తెలుస్తోంది.

రెండు నెలల సమయం అడిగిన అనుష్క

రెండు నెలల సమయం అడిగిన అనుష్క

సాహో సినిమాలో నటించడానికి తనకు రెండు నెలల సమయం కావాలని, అప్పటి వరకు తాను డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని అనుష్క చెప్పిందట.

అనుష్క కమిట్మెంట్స్

అనుష్క కమిట్మెంట్స్

సాహో మేకర్స్ తనను సంప్రదించడానికి ముందే అనుష్క కొన్ని తమిళ ప్రాజెక్టులకు కమిటైంది. దీంతో ముందు వారికి కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి వాటికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పిందట.

డేట్స్ క్లాస్

డేట్స్ క్లాస్

‘సాహో' చిత్ర యూనిట్ అడిగిన డేట్స్, తాను కమిటైన తమిళ మూవీ డేట్స్ క్లాస్ అయ్యేలా ఉండటంతో ఏమీ చేయలేని స్థితిలో తానే తప్పుకుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

డిసప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్

డిసప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్

ప్రభాస్-అనుష్క వండర్‌ఫుల్ పెయిర్. ఈ జంటను అభిమానులు కూడా ఎంతో ప్రేమించారు. వీరిద్దరు పెళ్ళి చేసుకుంటే బావుంటుందని కొందరు ఆశ పడ్డారు. ఆ మధ్య వచ్చిన వార్తలు కూడా వీరు ఇలా ఆశ పడటానికి కారణం. అయితే ప్రభాస్-అనుష్క పెళ్లి వార్తలు నిజం కాదని తేలడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి.

సాహో మూవీ న్యూ అప్డేట్

సాహో మూవీ న్యూ అప్డేట్

ఓ బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం.... బాలీవుడ్ నటుడు చుంకీ పాండే సాహో సినిమాలో కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. చుంకీ పాడేకు సాహో స్క్రిప్టు చాలా నచ్చిందని, అందులో తన పాత్ర కీలకంగా ఉండటంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

హాలీవుడ్ నుండి స్టంట్ డైరెక్టర్

హాలీవుడ్ నుండి స్టంట్ డైరెక్టర్

ప్రభాస్ సాహో మూవీని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బేట్స్‌ను రప్పిస్తున్నారు.

English summary
Rumors mills started hunting heroine for Saaho, here comes a new update, that Bollywood actress Shraddha Kapoor signed in for Saaho. Reports say that Shraddha Kapoor is all set to pair up Prabhas for Saaho in Sujeeth’s direction and the movie is to get released in all three languages Telugu, Hindi and Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X