»   » అడవి సాయికిరణ్ దర్శకత్వంలో నాగచైతన్య?

అడవి సాయికిరణ్ దర్శకత్వంలో నాగచైతన్య?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వినాయకుడు చిత్రం రూపొందించిన అడవి సాయికిరణ్ తొలి చిత్రంతోనే ప్రతిభ ఉన్న దర్శకుడుగా నిరూపించుకున్నాడు. తర్వాత రిలీజైన విలేజ్ లో వినాయుకుడు సోసోగా నడిచినా తక్కువ బడ్జెట్ తో టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకున్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అన్న దానికి ఫిల్మ్ సర్కిల్స్ లో సమాధానం వినపడుతోంది. అడవి సాయి కిరణ్ తాను తయారు చేసుకున్న ఓ రొమాంటిక్ కామిడీకి సంభందించిన లైన్ నాగచైతన్యకు వినిపించటంతో కథ వింటానని చెప్పటంతో బౌండ్ స్క్రిప్టుకోసం బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక వినాయకుడు రిలీజ్ తర్వాత సాయి కిరణ్ కి పెద్ద సంస్ధలనుంచే ఆఫర్స్ వచ్చాయని తెలిసింది. ఇక నాగచైతన్య రెండో చిత్రం ఏ మాయ చేసావే కమర్షియల్ గా విజయం సాధించటంతో మంచి ఉషారుగా ఉన్నాడు. నెక్ట్స్ చిత్రాన్ని అజయ్ భుయాన్ దర్శకత్వంలో చేస్తున్నారు. డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అజయ్ భుయాన్ ఇంతకు ముందు హౌస్ ఫుల్ అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu