»   » పేరు మార్చుకోలేదు బాబోయ్

పేరు మార్చుకోలేదు బాబోయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నితిన్‌ హీరోగా నటించిన 'హార్ట్‌ ఎటాక్‌' హీరోయిన్ ఆదాశర్మ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె రీసెంట్ గా ఓ ఫొటో ని(మీరు ప్రక్కన చూస్తున్నది) సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పెట్టి తన పేరు ఆదర్శ్ శర్మ గా మారిందని, టాలీవుడ్ ఇక తాను హీరో అనే అర్దం వచ్చేలా పోస్ట్ చేసింది. దాంతో ఆమె న్యూమరాలిజీ ప్రకారం పేరు మార్చుకుందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. సినిమా హిట్టైనా అవకాశాలు రాకపోవటంతో ఇలా పేరు మార్చుకుందని తెలుగు టీవి ఛానెల్స్ లో న్యూస్ లు వచ్చాయి. దాంతో అందరూ ఆమెను అడగటం మొదలు పెట్టారట. ఈ నేపధ్యంలో అలాంటిదేం జరగలేదంటూ మళ్ళీ ఓ ప్రకటన లాంటి పోస్ట్ ని పెట్టి తనను తాను సరిచేసుకునే ప్రయత్నం చేసింది.

అదాశర్మ ట్వీట్ చేస్తూ... ప్రతీ ఒక్కరూ నా పేరుని ఆదర్శ్ గా మార్చుకోవద్దంటూ చెప్తున్నారు. నేను మగడాలా మారలేదు. సరదాగా నా పేరుని తప్పుగా పలికిన దాన్ని ఇలా తీసుకుని పోస్ట్ చేసాను అని వివరణ ఇచ్చింది. సెలబ్రెటీలు స్ధాయిలో ఉన్నప్పుడు సరదాగా చేసేవి కూడా జనం సీరియస్ గా తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఆమెకు అర్దమై ఉంటుంది.

 Adha sharma not changed her name

ఎన్టీఆర్,పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఫైనల్ అయ్యిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆమె మరెవరో కాదు...పూరీ తాజా చిత్రం హార్ట్ ఎటాక్ లో నితిన్ సరసన కనిపించిన అదా శర్మ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ సైతం ఆమెను తన సరసన చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రీసెంట్ గా హార్ట్ ఎటాక్ చిత్రం చూసిన ఎన్టీఆర్ ఆమెతో చేయటానికి ఆసక్తి చూపించాడని,ఆమె ఫెరఫార్మెన్స్ ని మెచ్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజైన ఆమె బాలీవుడ్ చిత్రం హసీతో హై పసీ సైతం ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది.

ఆదా శర్మ మాట్లాడుతూ...హార్ట్ ఎటాక్ సినిమా నాకు తెలుగులో మొదటిది. అయితే దర్శకుడు పూరీ తో ఇంట్రడ్యూజ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో సినిమా చేస్తే కెరిర్ బాగుంటుందని చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. అయితే ఈ సినిమా ద్వారా నేను ది బెస్ట్ యాక్షన్ ఇచ్చాను. దీనిలో నా క్యారెక్టర్ ఆసక్తిగా ఉంటుంది. కానీ దీనిలో తెలుగు డబ్బింగ్ లు చెప్పడానికి నేను రెండు నెలల ముందే స్ర్కిప్టును ప్రిపేర్ అయ్యాను అంది.

English summary

 Adha Sharma tweeted: "Every1 asking I HAVE NOT CHANGED MY NAME TO AADARSH !! I HAVE NOT TURNED INTO A MAN.Just posted a funny name tag where my name was misspelt"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu