»   » ఆ హీరోయిన్ మాటల్లో అర్థం ఏమిటి? ఎఫైర్ ఒప్పుకుందా?

ఆ హీరోయిన్ మాటల్లో అర్థం ఏమిటి? ఎఫైర్ ఒప్పుకుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ డైరెక్టర్, భాగ్ మిల్ఖా భాగ్ చిత్ర హీరో పర్హాన్ అక్తర్ ఇటీవలే తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధునాతో దాదాపు 15 ఏళ్ల పాటు అనోన్య దాంపత్యం సాగించిన అక్తర్ ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది.

విడాకుల ప్రకటనకు ముందు పర్హన్ అక్తర్ ‘వాజిర్' అనే చిత్రంలో నటించారు. వాజిర్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అదితి రావు హైదరితో పర్హాన్ ఎఫైర్ కొనసాగిస్తున్నారనే ప్రచారం కొంత కాలంగా బాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అతడు భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అదితి రావుతో సహజీవనం చేయాలనే ఉద్దేశ్యంతోనే పర్హాన్ తన భార్యకు విడాకులు ఇచ్చారనే వాదన కూడా ఉంది.

Aditi Rao Hydari Talks About Her Affair With Farhan!

అయితే ఇంతకాలం ఈ ఎఫైర్ రూమర్ మీద అటు పర్హాన్ కానీ, ఇటు అదితి రావు కానీ స్పందించలేదు. ఇటీవల ఫెమీనా బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన అదితి రావును రిపోర్టర్లు ఈ విషయమై ప్రశ్నించారు. అయితే ఈ వార్తలను ఆమె ఖండించక పోగా.... చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది.

‘వేరొకరి వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరి వ్యక్తి గత జీవితం వారికి ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడం నాకు ఇష్టం ఉండదు' అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. అదితి కామెంట్స్ ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారు.

ఎఫైర్ వార్తలను ఆమె ఖండించ లేదు కాబట్టి.... పర్హాన్ అక్తర్, అదితి రావుల మధ్య ‘సం'బంధం అనే వాదన వినిపిస్తోంది. ఆమె కామెంట్స్ లో..... తమ వ్యక్తిగత జీవితంపై మీడియా వారు అత్యుత్సాహం ప్రదర్శించవద్దనే అంతరార్థం కూడా ఉందని అంటున్నారు.

English summary
Aditi has spoken about her alleged relationship with Farhan. She said, "I wouldn't want to comment on anyone's personal life. Everyone deserves peace and dignity and I would like to give that to them, and so should everyone else." Smart girl, isn't she?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu