»   » వచ్చే ఏడాది ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ.. కరణ్ జోహర్, జక్కన్న మంతనాల జోరు..

వచ్చే ఏడాది ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ.. కరణ్ జోహర్, జక్కన్న మంతనాల జోరు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాహుబలి సినిమా సాధించిన కలెక్షన్లతో ప్రభాస్‌కు నేషనల్ మార్కెట్ ఇతర బాలీవుడ్ హీరోల స్థాయిలో పెరిగింది. అంతేకాకుండా ప్రభాస్‌ క్రేజ్ కూడా పెరిగి నేషనల్ ఐకాన్‌గా మారాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా తీస్తే హిందీలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి వసూళ్లను రాబట్టవచ్చనేది బాలీవుడ్ నిర్మాతల వ్యూహాం. ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు కొత్త కొత్త రూమర్లు తెరపైకి వస్తున్నాయి.

 కరణ్ జోహర్, రాజమౌళి మధ్య చర్చలు

కరణ్ జోహర్, రాజమౌళి మధ్య చర్చలు

అలాంటి వార్తల నేపథ్యంలోనే సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ మధ్య ఇటీవల చర్చలు బాగానే జరుగుతున్నట్టు సమాచారం. ప్రభాస్ సరిపోయే కథల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే కథకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ స్టోరీ లాక్ అయితే స్క్రిప్ట్‌పై రాజమౌళి కసరత్తు ప్రారంభిస్తారనే ఫిలింనగర్ టాక్.


డీవీవీ దానయ్య సినిమాపై జక్కన

డీవీవీ దానయ్య సినిమాపై జక్కన

ఇదిలా ఉండగా, టాలీవుడ్ నిర్మాత డీవీవీ దానయ్య కోసం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారనేది మరో తాజా వార్త. స్టోరీ లైన్ ఫైనల్ అయిందని, దాంతో స్క్రిప్ట్ వర్క్‌పై రాజమౌళి దృష్టిసారించినట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. దానయ్య సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉందట. అయితే ఈ సినిమాలో కూడా ప్రభాస్ హీరో అనే టాక్ వినిపిస్తున్నది. అయితే ఇంకా నటీనటుల ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది.


ఐదేళ్ల తర్వాత సాహోలో.

ఐదేళ్ల తర్వాత సాహోలో.

కాగా, బాహుబలి2 అనంతరం దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత మరో చిత్రంలో నటించేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అమెరికాలో విహార యాత్ర చేస్తున్న ప్రభాస్ జూన్ మొదటివారంలో తిరిగి వస్తారని, ఆ తర్వాత సాహో చిత్ర షూటింగ్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటారు. అమెరికా పర్యటనలో ప్రభాస్ పలు చిత్రాల కథలను పరిశీలించినట్టు సమాచారం.


 వచ్చే ఏడాది బాలీవుడ్‌ సినిమా..

వచ్చే ఏడాది బాలీవుడ్‌ సినిమా..

ఈ ఏడాది చివరికల్లా సాహో పూర్తయ్యే అవకాశం కనపడటం లేదు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సాంకేతికంగా హాలీవుడ్ స్థాయలో నిర్మితమవుతున్నది. అంటే మరో ఏడు, ఎనిమిది నెలలు సాహోపైనే ప్రభాస్ దృష్టిపెట్టే అవకాశం ఉంది. అంటే రాజమౌళి టాలీవుడ్‌లో నిర్మించే చిత్రమైనా.. బాలీవుడ్‌లో తీసే సినిమాలోనైనా ప్రభాస్ నటించాలనుకుంటే, ఆ సినిమా కనీసం వచ్చే ఏడాది ప్రారంభం కల్లా సెట్స్ పైకి అవకాశం ఉంటుంది.English summary
And now, we hear that SS Rajamouli is already planning another film with Prabhas. Says a source, Karan Johar is also in talks with Rajamouli and wants to introduce Prabhas in the Hindi film circuit with a Bollywood debut too. Both Rajamouli and Prabhas have been constantly in touch with each oher and once an idea is locked, Rajamouli will get the script in place. But that will take at least another year or so to roll.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more