»   » జూన్ లో ప్రారంభం కానున్న మహేష్,దీపికాపదుకొణే చిత్రం..?

జూన్ లో ప్రారంభం కానున్న మహేష్,దీపికాపదుకొణే చిత్రం..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దీపికా పదుకొణే అవటానికి దక్షిణాది భామే అయినా బాలీవుడ్ లోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. దాదాపు బాలీవుడ్ లొ ఉన్న అగ్ర హీరోలందరి తోనూ నటించిన దీపిక ఇప్పటి వరకూ సౌత్ లో ఒకే ఒక్క చిత్రంలో నటించారు. అదీ దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా కోచ్చయడైయాన్ అనే 3డీ యానిమేషన్ చిత్రం.

ఆ ఒక్క సినిమా తోనే సరిపెట్టిన ఈ కన్నడ చిన్నది ఇప్పుడు మరో సారి దక్షిణాది ప్రేక్షకులను అలరించనుంది. ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ సారి తెలుగు తెర పైనే మెరవనుంది. అదికూడా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు పక్కన.మహేశ్‌బాబు, దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ల కలయికలలో ఒక భారీ చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

 After Brahmotsavam, Mahesh Babu to star in AR Murugadoss's film

విజయ్ హీరోగా కత్తి చిత్రాన్ని రూపొందించిన ఏఆర్.మురుగదాస్ ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లి అకిరా అనే హిందీ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాక్షీసిన్హా హీరోయిన్ గా నటించిన ఆ చిత్రం షూటింగ్ ఈ మధ్యే పూర్తి చేసుకుంది. సెప్టెంబరులో విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆ తరువాత మురుగదాస్ అజిత్ హీరోగా చిత్రం చేయనున్నట్లు వార్తలు వచ్చినా అదేం జరగలేదు.. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చిత్రం ముందుకు రావడం విశేషం.

తమిళం, తెలుగు భాషల్లో ద్వి భాషా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా లో హీరోయిన్ ఎవరన్న అంశం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.ఇంతకు ముందు నటి కీర్తీసురేశ్ నటించనుందనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే నే హీరోయిన్ గా ఖాయమైనట్టు సమాచారం.

ఒకవేళ ఇదే నిజమైతే ఈ భామ తెలుగులోకి అడుగు పెట్టే చిత్రం మహేష్ దే అవుతుంది. మహేశ్‌బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రాన్ని పూర్తి చేసేపనిలో ఉన్నారు.ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించే తాజా చిత్రం జూన్ లో మొదలవ్వొచ్చంటున్నారు.....

English summary
Deepika padukone to romance Mahesh Babu in AR.Murugadas's New movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu