»   » బాలకృష్ణ ‘సింహా’ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టనున్నారా!?

బాలకృష్ణ ‘సింహా’ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టనున్నారా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం, పరుచూరి కిరీటి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం' సింహా" ఈ చిత్రంతో బాలయ్య సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సింహా చిత్రం తర్వాత రాజకీయాల్లో ఒక దిట్టైన పాత్ర పోషించాలని బాలయ్య అనుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.

బాలకృష్ణ కు తెలుగు దేశం పార్టీకి కాబోయే అధ్యక్షుడిగా నియమించాలని ఇటీవల లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించకపోవడం ఒకటైతే టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం నాడు, పలువురు కార్యకర్తలు, నేతలు బహిరంగంగానే బాలయ్యకు 'జై" కొట్టండం చూస్తుంటే ఈ విషయానికి మరింత ఊతమిస్తోంది. లక్ష్మీ పార్వతి తోపాటు నందమూరి హీరోలందరి అభిమతం కూడా బాలకృష్ణకు కుర్చీ అప్పజెప్పాలన్నదేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అలా జరగనట్టైతే జూ ఎన్టీఆర్ కి అయినా టీడీపీలో పట్టంకట్టాలని, ప్రేక్షకులలో అతనికున్న క్రేజ్ తో యూత్ కి లీడర్ గా జూనీయర్ ఎన్టీఆర్ పనిచేస్తే తెలుగు యువత మరికొంత బలపడుతుందనేది జూఎన్టీఆర్ అభిమానుల వాదన. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం బాలయ్య అంశంపై నోరు మెదపడం లేదు. జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మీప్రణతితో కుదర్చడం, పైగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద బావ హరికృష్ణను పొగడ్తలతో ఆకాశానికెత్తడం ఇవన్నీ చూస్తుంటే బాబు పన్నాగాలు అర్థం కాకపోవడం కొద్దిగా ఇరకాటమే మరి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu