బాలీవుడ్ లో జూ.ఎన్టీఆర్ నయా ప్రాజెక్ట్.. సాలిడ్ ప్లానింగ్
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ లో నటించారు. ఈ మల్టీస్టారర్ ఫిల్మ్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రాంతీయ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబడుతుండటం విశేషం.
ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై గ్లోబ్ వైడ్ గా గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి ఎన్టీఆర్ కు ఆఫర్స్ వచ్చాయి. ఆయనతో సెపరేట్ ఫిల్మ్స్ చేసేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ నుంచి మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చారు. డ్యాన్స్, యాక్షన్, స్టంట్స్, పెర్ఫామెన్స్ విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు.

సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ లోనూ జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో జూ.ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరో చిత్రం చేయబోతున్నారంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అది కూడా వార్ 2 చిత్రాన్ని నిర్మించిన యష్ రాజ్ స్పై యాక్షన్ ఫిల్మ్ సంస్థలోనే జూనియర్ ఎన్టీఆర్ తో స్టాండలోన్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్స్ లోనూ యష్ రాజ్ ఫిల్మ్స్ లో మరో సినిమా చేయాలని ఉందంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇకపై ఎన్టీఆర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాలు చేయబోతున్నారని అంటున్నారు. వార్ 2కు మంచి రెస్పాన్స్ దక్కడంతో యష్ రాజ్ స్పై యూనివర్స్ లో మరో ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉందా? అని సందేహిస్తున్నారు. ఇప్పటికే యష్ రాజ్ స్పై యూనివర్స్ లో వార్, టైగర్ జిందా హై, పఠాన్, ఎక్తా టైగర్ వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో ఎన్టీఆర్ తో మరేదైనా ప్రాజెక్ట్ వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ప్రస్తుతానికి ఊహాగానాలే ఉన్నాయి.
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. నిర్మాత ఆదిత్యా చోప్రా ఖర్చుకు వెనకాడకుండా బెస్ట్ అవుట్ పుట్ ను అందించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటించింది. అషుతోశ్ రాణా, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.210 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత దేవర 2 రానుంది.


Click it and Unblock the Notifications











