»   » దేవుడా: 'బ్రహ్మాత్సవం' సాంగ్ టీజర్ ... ట్యూన్ ,లిరిక్స్ కూడా కాపీనా?

దేవుడా: 'బ్రహ్మాత్సవం' సాంగ్ టీజర్ ... ట్యూన్ ,లిరిక్స్ కూడా కాపీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అదేంటో మహేష్ బాబు తాజా చిత్రం 'బ్రహ్మాత్సవం' ప్రమోషన్ నిమిత్తం ఏం రిలీజ్ చేసినా అది ..కాపీ విమర్శలను ఎదుర్కొంటోంది. కొద్దిరోజుల క్రితం చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేస్తే అది రాజస్దాన్ టూరిజం యాడ్ నుంచి లిప్ట్ చేసారు అని ఆ వీడియోలతో సహా ప్రూవ్ చేసారు నెట్ జనులు.

ఈ సారి సాంగ్ టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ సైతం కాపీనే అని మీడియా వర్గాల్లో వినపడుతోంది. కాపీనా, ప్రేరణా అనేది ప్రక్కన పెడితే ఆ సాంగ్ టీజర్, దానికి మూలం ఇక్కడ చూడండి.


మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'బ్రహ్మాత్సవం' . ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది టీమ్. అందులో భాగంగా...సాంగ్ టీజర్ ని విడుదల చేసారు.


'బ్రహ్మోత్సవం' చిత్రంలోని మధురం మధురం.. అనే పాట టీజర్‌ విడుదలైంది. చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియోను అభిమానులతో పంచుకుంది.ఈ పాట రాసిందెవరో కానీ... ట్యూన్, లిరిక్స్ మొత్తం మధురాష్టకం నుంచి మొత్తం ఎత్తారు. మధురాష్టకం శ్రీకృష్ణుడు మీద..శ్రీ వల్లభాచార్య ( 1535) రాసినది. శ్రీకృష్ణుడుని వర్ణన చేస్తూ ఈ అష్టకం సాగుతుంది. మధురాష్టకం మొత్తం మధురం అంటూ సాగుతుంది. దాన్నే యాజటీజ్ గా ఈ టీజర్ లో వాడారు.
అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం అంటూ ఈ అష్టకం చాలా అధ్బుతంగా సాగుతుంది. మీరు గూగుల్ లో లేదా, యూ ట్యూబ్ లో మధురాష్టకం చెక్ చేసుకోవచ్చు.


సమంత, కాజల్‌, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

English summary
Brahmotsavam’s unit has released a special teaser song named “Adharam Madhuram“. That lyrics are nothing but a total lift from “Madhurashtakam “, tune is lifted from a private album which recited Madhurashtakam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu