»   » సమంతపై మళ్లీ షాకింగ్ రూమర్స్, పెళ్లి గురించి కాదు

సమంతపై మళ్లీ షాకింగ్ రూమర్స్, పెళ్లి గురించి కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోలు, హీరోయిన్స్ పై రూమర్స్ రావటం అత్యంత సహజం. సెలబ్రెటీ స్టేటస్ అలాంటిది. సమంత పరిస్దితి అదే. ఆమె నేను కొద్దిగా స్లో అవుతున్నాను. జనతా గ్యారేజ్ తర్వాత కొత్తగా ఏ సినిమాలు ఒప్పుకోలేదు అనగానే ఆమెపై ఆశ్చర్యకరమైన రూమర్స్ వెబ్ మీడియాలో మొదలయ్యాయి.

ఆ రూమర్స్ గతంలో వచ్చిన లాంటివే..హెల్ట్ ప్లాబ్లం అంటూ ఇంతకు ముందు సమతం గురించి వార్తలు వచ్చాయి. ఆమె స్కిన్ కు సమస్య ఉందని, ట్రీట్ మెంట్ తీసుకుంది అన్నారు. హఠాత్తుగా రెండు మూడు నెలలు పాటు మిస్సవటం వెనక కారణం ఇదే అన్నారు.

Again Shocking rumours on Samantha's health !!

ఇప్పుడు మరోసారి సమంత ఆరోగ్యం పై హెల్త్ ప్లాబ్లంపై రూమర్స్ మొదలయ్యాయి. ఆమె ఓ మిస్టీరియస్ హెల్త్ ప్లాబ్లంతో బాధ పడుతోందని అంటున్నారు. ఆమె తన పర్శనల్ స్టాఫ్ తో కలిసి ఈ వారం సింగపూర్ వెళ్తోంది. అక్కడ ఓ స్పెషలిస్ట్ తో అపాయింట్ మెంట్ అందుకే వెళ్తోంది అంటున్నారు.

అక్కడ ఎంత కాలం ఉంటుంది, ఏం హెల్త్ ప్లాబ్లం, ఎవరిని కలుస్తోంది అనే విషయాలు త్వరలో బయిటకు రాబోతున్నాయంటున్నారు. అయితే అ...ఆ చిత్రం సక్సెస్ ఆనందంలో ఉన్న ఆమె వరస సినిమాలు చేసి రిలాక్స్ కోసం, టూర్ కు వెళ్తోందని మరికొందరు అంటున్నారు.

ఏదైమైనా విషయం తెలియకుండా హెల్త్ వంటి విషయాలు గురించి రూమర్స్ ప్రచారం చేయకుండానే మంచిది. ఎందుకంటే ఈ రూమర్స్ వారి కెరీర్ పై కూడా ప్రభావం చూపే అవకాసం ఉంది.

    English summary
    Samantha is reportedly flying to Singapore later this week along with her Personal staff.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu