ఒక్క సినిమాతో భారీ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో
చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయం సాధించింది 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా నటించిన ఈ సినిమాను స్వరూప్ తెరకెక్కించాడు. డిటెక్టివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను రాహుల్ యాదవ్ నిర్మించారు. సినిమా విడుదలైనప్పటి నుంచే హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా.. తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సినిమాలో హీరో నవీన్ నటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అతడి నటన, హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తానికి చర్చనీయాంశంగా మారిపోయాడు చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' విజయంతో ఉత్సాహంతో ఉన్న ఈ యంగ్ హీరో.. మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు తీయాలనుకుంటున్నట్లు ఇటీవల వెల్లడించాడు. అంతేకాదు, రోటీన్‌కు భిన్నమైన సినిమాల్లో నటించాలనుందని తన కోరికను వెల్లడించాడు. దీంతో అతడిని హీరోగా పెట్టి సినిమా తీయడానికి చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రయత్నాల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అతడు త్వరలోనే భారీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సినిమా చేయబోతున్నాడట. ఇందుకోసం ఇప్పటికే సంస్థ నుంచి పిలుపు కూడా వచ్చిందని తెలుస్తోంది. నలభై ఏళ్ల చరిత్ర కలిగిన వైజయంతీ మూవీస్ గత సంవత్సరం 'మహానటి' సినిమాతో వచ్చింది. అలాగే మహేశ్ బాబు నటించిన 'మహర్షి' నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తమ సంస్థలో మరిన్ని సినిమాలు చేయడానికి అశ్వనీదత్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే త్వరలోనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీయాలని భావిస్తున్నారట. ఇందుకోసం కథ కూడా రెడీ అయిపోయిందని తెలిసింది. ఈ సినిమాకే నవీన్‌ను తీసుకుంటున్నారని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. నవీన్ ఈ సినిమానే కాకుండా 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' నిర్మాతతోనూ సినిమా చేయాల్సి ఉందని టాక్.


Click it and Unblock the Notifications











