»   » పది కోట్లు ఇచ్చినా కథ కూడా నచ్చాలి: ఐష్

పది కోట్లు ఇచ్చినా కథ కూడా నచ్చాలి: ఐష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటి వరకు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం ఏడు కోట్లు తీసుకుంటున్న తారగా కరీనా కపూర్ మొదటి స్థానంలో ఉంటే ..ప్రస్తుతం ఆమెను మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ అధిగమించి సినిమాకు పది కోట్లు తీసుకుంటుందని సమాచారం. అది కూడా డిమాండ్ చేసి మరి. అలాగే ఆమె రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు..కథల ఎంపిక విషయం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. దాదాపు 3 సంవత్సరాల క్రితం ఐశ్వర్య ప్రధాన పాత్ర ధారిగా జగ్ ముంధ్రా దర్శకత్వంలో ప్రోవోక్ట్ అనే చిత్రం రూపొందింది. ఇప్పుడాచిత్రాన్ని ఆధారం చేసుకొని బాబీ పుష్కర్ణ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ ను కథానాయికగా ఎంపిక చేశారు.

కానీ ఐష్ కు ఈ విషయాన్ని చెప్పడానికి సుమారు 3 నెలలుగా బాబీ ప్రయత్నం చేస్తున్నాడట. చేతి నిండా సినిమాలతో బిజీగా వున్న ఐష్ ఇటీవల ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చి, విషయం తెల్సుకున్న తర్వాత 10 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఆయన ఇవ్వడానికి సిద్దపడ్డప్పటికీ. కథ పూర్తిగా విన్న తర్వాత మాత్రమే అని చివరికి ఐష్ ట్విస్ట్ ఇచ్చిందని సమాచారం. దీన్ని బట్టి ఐష్ కు ఎంతి ఇచ్చినా కథ నచ్చకపోతే ఒప్పుకోదు అని క్లియర్ గా అర్థం అవుతుంది కదా!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu