»   » ఐశ్వర్య రాయ్ ఆత్మహత్య అంటూ వార్తలు, ఇదీ అసలు సంగతి!

ఐశ్వర్య రాయ్ ఆత్మహత్య అంటూ వార్తలు, ఇదీ అసలు సంగతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ ఆత్మహత్య చేసుకుందంటూ.... ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో వార్తలు హచల్ చల్ చేసాయి. ఒక్కసారిగా ఈ వార్త చూసి అభిమానులు షాకయ్యారు.

ఈ వార్తలపై జాయతీ మీడియా కూడా అలర్టయింది. ఐశ్వర్యకు ఏమైంది? అంటూ ఆరాతీయగా.... ఈ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని, ఐశ్వర్య రాయ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదని తేలిపోయింది. వెంటనే..... ఐశ్వర్యరాయ్ బికేమ్ ది లేటెస్ట్ విక్టిమ్ ఆఫ్ డెత్ హాక్స్ అంటూ ఈ పుకార్ల విషయాన్ని జాతీయ మీడియా హైలెట్ చేసింది.

గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయిన సంగతి తెలిసిందే.

మత్తు మందు అధికంగా తీసుకుందంటూ..

మత్తు మందు అధికంగా తీసుకుందంటూ..

‘ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విషయంలో బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యరాయ్ కి విబేధాలు వచ్చాయని, దీంతో మత్తుమందు అధికంగా తీసుకుని ఐష్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ వార్తలు హల్ చల్ చేసాయి. అయితే ఇవన్నీ రూమర్స్ అని తేలింది.

ఆదివారం రాత్రి ఐష్ ఎక్కడ ఉందంటే

ఆదివారం రాత్రి ఐష్ ఎక్కడ ఉందంటే

ఆదివారం రాత్రి ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో మనీష్ మల్హోత్రా పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి వెళ్లిన ఐశ్వర్యరాయ్-అభిషేక్ దంపతులు అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల వరకు అక్కడే ఉన్ననట్లు పలువురు సినీ ప్రముఖులు స్పష్టం చేసారు.

దురదృష్టకరం

దురదృష్టకరం

కేవలం బాలీవుడ్లోనే కాదు... హాలీవుడ్లోనూ గతంలో పలువురు ప్రముఖుల విషయంలో ఇలాంటి వార్తలు వచ్చాయి. సినీ స్టార్లపై ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగడం దురదృష్టకరం అంటున్నారు అభిమానులు.

ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లు: బచ్చన్ ఫ్యామిలీ చీప్ రూమర్స్, బిగ్ బి స్పందన!

ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లు: బచ్చన్ ఫ్యామిలీ చీప్ రూమర్స్, బిగ్ బి స్పందన!

ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లు: బచ్చన్ ఫ్యామిలీ చీప్ రూమర్స్, బిగ్ బి స్పందన!...(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
Actor Aishwarya Rai Bachchan became the latest victim of allegedly false death rumours late on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu