»   » రియల్ లైఫ్‌లో ఐశ్వర్యరాయ్‌కి విలన్ అతడే, అందుకే ఆ షరతు?

రియల్ లైఫ్‌లో ఐశ్వర్యరాయ్‌కి విలన్ అతడే, అందుకే ఆ షరతు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఇండియ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్. తన అందం, నటనతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్‌ను ప్రేమ వివాహం చేసుకుని సెటిలైన సంగతి తెలిసిందే.

  పెళ్లికి ముందు ఐశ్వర్యరాయ్ జీవితం చాలా ఆసక్తికరం. సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం సంచలనం. వీరి మధ్య జరిగిన బ్రేకప్ అప్పట్లో సెన్సేషన్. బ్రేకప్ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఐశ్వర్యరాయ్ మానసికంగా కృంగిపోయింది. సల్మాన్ ఖాన్ కొంతకాలం పిచ్చోడిలా ప్రవర్తించాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

  రియల్ లైఫ్ విలన్

  రియల్ లైఫ్ విలన్

  ఐశ్వర్య రాయ్‌కి రియల్ లైఫ్‌లో విలన్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే చాలా మంది చెప్పే పేరు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ లైఫ్‌లో కూడా ఐశ్వర్యరాయ్ మరిచిపోలేని పీడకల.

  Salman Khan Turns 51, Happy Birthday to Dabang Of Bollywood | Filmibeat Telugu
  కలిసి నటించలేదు

  కలిసి నటించలేదు

  ఒకప్పుడు ఇద్దరూ కలిసి బాలీవుడ్లో హిట్స్ కొట్టిన ఐశ్వర్యరాయ్, సల్మాన్...... బ్రేకప్ గొడవ తర్వాత కలిసి నటించింది లేదు. అయితే చాలా కాలం తర్వాత ఈ ఇద్దరినీ కలిపి సినిమా తీయాలనే ప్రయత్నం చేశారు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.

  పద్మావతి కథ మొదట వీరికే..

  పద్మావతి కథ మొదట వీరికే..

  ప్రస్తుతం దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ‘పద్మావతి' సినిమా కథను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొదట ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్‌లకే చెప్పారట. ఈ ఇద్దరితోనే మొదట ఈ సినిమా చేయాలనకున్నారట.

  ఐశ్వర్యరాయ్ షరతు

  ఐశ్వర్యరాయ్ షరతు

  ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో చేయాలని ఐశ్వర్య రాయ్‌ని దర్శకుడు కోరగా.... ఓ షరతు పెట్టింది. ఈ సినిమా చేస్తాను కానీ, సల్మాన్ ఇందులో విలన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర చేస్తేనే తాను పద్మావతి రోల్ చేస్తానని షరతు పెట్టిందట.

  నో చెప్పిన సల్మాన్

  నో చెప్పిన సల్మాన్

  ఐశ్వర్యరాయ్ పెట్టిన షరతు గురించి సల్మాన్ ఖాన్‌ను చెప్పగా..... ఐశ్వర్యరాయ్ సినిమాలో తాను విలన్ పాత్ర అస్సలు చేయను అని తేల్చి చెప్పాడట. అలా ఈ ఇద్దరూ ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.

  పద్మావతి

  పద్మావతి

  ప్రస్తుతం ‘పద్మావతి' దీపిక పదుకోన్, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దీపిక టైటిల్ రోల్ రాణి పద్మావతి పాత్ర పోషిస్తుండగా, షాహిద్ కపూర్ రావల్ రతన్ సింగ్ పాత్రలో, రణవీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించబోతున్నారు.

  భారీ బడ్జెట్

  భారీ బడ్జెట్

  రూ. 160 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది నవంబర్ 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  Bollywood filmmaker Sanjay Leela Bhansali has almost finished his ongoing project 'Padmavati' with Ranveer Singh, Deepika Padukone and Shahid Kapoor in the lead roles. Earlier, Sanjay Leela Bhansali approached Aishwarya and Salman Khan for this movie. According to a Bollywood article, Mrs Aishwarya Rai was ready to essay Padmavati role on the condition that if Salman plays antagonist (Alauddin Khilji) role in the film so that she cannot share screen space with him. But, this condition by Aishwarya Rai was turned down by Salman as wasn't ready to do the grey role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more