»   »  బేనజీర్ భుట్టో గా ఐష్

బేనజీర్ భుట్టో గా ఐష్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai Bhachan
ఐశ్వర్యారాయ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయింది. ఎక్కడెక్కడి పాత్రలూ ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా మానవబాంబుకి బలైన పాక్ మాజీ ఫ్రధాని బేనజీర్ భుట్టో జీవిత చరిత్ర ఆధారంగా యూటీవీ వారు సినిమా ఫ్లాన్ చేస్తున్నారు. దానిలో ప్రధాన పాత్ర అయిన బేనజీర్ కోసం ఐష్ ని సంప్రదించారు. మొదట ఆ పాత్ర కోసం కరీనాని అనుకున్నారట.

కానీ ఆమె ఇమేజ్ సరిపోదని ఆలోచనలో పడి కాన్సెల్ చేసారు.దాంతో ఆ పాత్ర ఐష్ వద్దకు వచ్చింది. ఆమె సంతోషంగా ఒప్పుకుందిట. జిస్మ్,జానీ గదర్,జన్నత్ చిత్రాలకు లిరిక్ రైటర్ గా పనిచేసిన నీలేష్ మిశ్రా ఈ సినిమా కి స్క్ర్రిప్టు రెడీ చేస్తున్నాడు. అయితే పాకిస్ధాన్ అధికారులనుండి ఇంకా పర్మిషన్ రావల్సి ఉంది. అన్నీ సక్రమంగా కుదిరితే వచ్చే సంవత్సరం ప్రాజెక్టు ఉంటుందంటున్నారు. ఇక పాకిస్ధాన్ ,ఇండియా,గల్ఫ్ దేశాల మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమా హిందీ,ఉర్ధూ,పర్షయన్,అరబిక్ భాషల్లో తీస్తారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X