Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Aishwarya Rajinikanth: కాంట్రవర్సీ లవర్ బాయ్‌తో ధనుష్ మాజీ భార్య.. విడాకుల అనంతరం డేరింగ్ డిసిషన్
తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న జంటలలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పలు మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయినట్లు ల్గా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక మళ్లీ వీరిని కలిపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆ విషయం అందరూ మరచిపోతున్న సమయంలో ఐశ్వర్య రజనీకాంత్ తన కెరీర్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మళ్ళి దర్శకురాలిగా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలి అని ఆమె కొత్త సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన కాంట్రవర్సీ హీరో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

18 ఏళ్ల బంధానికి ముగింపు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తమిళ్ హీరో ధనుష్ ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎన్ని గొడవలు ఎన్ని జరిగినా కూడా ఆ విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడింది. కానీ ఇటీవల విడాకులు తీసుకోవడంతో చిత్ర పరిశ్రమలో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

మళ్ళీ కలవాలి అని..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట హఠాత్తుగా విడిపోవడం ఏమిటి అని పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో స్పందించారు ఇక ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కు దగ్గరగా ఉండే స్నేహితులు కూడా మరొకసారి దాంపత్య జీవితం గురించి ఆలోచించాలి అని ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తే మంచిది అని కూడా సలహాలు ఇచ్చారు.

కొనసాగిన చర్చలు
అయితే ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ ఇద్దరు కూడా వారి వ్యక్తిగత జీవితాల విషయంలో విడాకులు తీసుకోవడమే మంచిది అని బలంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పైన ఎవరు కూడా వారిని ఇబ్బంది పెట్టలేదు అని తెలుస్తోంది. ఇక రజనీకాంత్ అలాగే ధనుష్ తల్లిదండ్రులకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ మధ్యన ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా వాళ్లిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉన్నట్లుగా మీడియా ముందు చెప్పినప్పటికీ కూడా ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

దర్శకురాలిగా..
ఇక అందరూ వేరే దాంపత్య జీవితం లో వస్తున్న వార్తల గురించి మరచిపోతున్న సమయంలో హఠాత్తుగా ఐశ్వర్య రజనీకాంత్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ధనుష్ తోనే ఆమె 3 అనే సినిమా చేసింది. ఆ తర్వాత కార్తీక్ కొడుకు గౌతమ్ తో కూడా ఒక సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య డాక్యుమెంటరీలకు కూడా దర్శకత్వం వహించింది.

ఆ హీరోతో సినిమా
ఇక ఇప్పుడు తన డైరెక్షన్ కెరీర్ ను సరికొత్తగా మొదలు పెట్టాలి అనే ఐశ్వర్య తమిళ హీరో తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కోలివుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ లవర్ బాయ్ గా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో నిలిచే శింబుకు ఐశ్వర్య స్టోరీ చెప్పినట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఒక విధంగా శింబుతో సినిమా చేయడం డేరింగ్ అని కోలీవుడ్ ఇండస్ట్రీలో కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video

మొదలైన చర్చలు
రీసెంట్ గా శింబు తమిళ్ లో మానాడు అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మరో రెండు ప్రాజెక్టులను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్న శింబు అందులో భాగంగానే ఐశ్వర్య రజనీకాంత్ తో కూడా ఒక కథపై చర్చలు జరువుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.