»   » ప్రాణమొచ్చిన అజంతా శిల్పం: ఇలియానా

ప్రాణమొచ్చిన అజంతా శిల్పం: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆకాశంలో మిళమిళ మెరిసే నక్షత్రాల మధ్య నుండి వెన్నెల కురిపించాల్సిన చందమామ వెండితెరపై వెన్నెల కురిపిస్తోందా? నింగిలో దేదీప్యమానాంగా వెదజిల్లాల్సిన దవతార సినీవినీలాకాశంలో అగ్రతారగా భాసిల్లుతోందా? నాజూకు సుందరి ఇలియానాను చూడగానే కుర్రకారును వెంటాడే ప్రశ్నలివి. బ్రహ్మాదేవుడు ప్రశాంతగా వున్న సమయంలో ప్రత్యేక శ్రద్ద వహించి ఈ పాలరాతి బొమ్మను, అధ్బుత సైందర్యంతో తీర్చి దిద్దారేమో అనిపిస్తుంది. మొత్తానికి ప్రాణం వచ్చిన అజంతా శిల్పంలా ఉంటారామె. అందుకే యువతరానికి ఇలియానా అంటే అంత పిచ్చి.

ఒక్క అందం విషయంలోనే కాదు అభినయ పరంగా కూడా ఇటియాన గ్రేటే. ఎందుకంటే సెట్ లో ఉన్నంత సేపు, కెమెరా ముందు ఉన్నత వరకు మరేది ఆలోచించదు ఆ పాత్రలో లీనమై, ఆ క్యారెక్టర్లనీ అంతగా ప్రేమించి నటిస్తుంది అందుకు ఉదాహరణే 'రాఖీ". అందులో ఆమె నటన మేధావులను సైతం మెప్పించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పోటి పడి మరీ నటించారు ఇలియానా. మరి అప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న ఎన్టీఆర్ తో జతకట్టిన ఇలియానా ఇప్పుడు స్లిమ్ అయిన ఎన్టీఆర్ తో 'శక్తి" సినిమాకి సై అన్నారు. జూ ఎన్టీఆర్ ఆల్ రెడీ మెహర్ రమేష్ దర్శకత్వ కంత్రి సినిమా ఎంతటి విజయాన్ని గనించిందో అందరికి తెలిసిన విషయమే నిజానికి పాత కాంబినేషనే అయినా కొత్తగా కనిపించే ఈ కలయిక ప్రేక్షకులకు కనుల పండుగ చేయక మానదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X