Ajay Bhupathi నిర్మాతగా మారుతున్న RX 100 డైరెక్టర్.. క్రేజీ టైటిల్‌తో అజయ్ భూపతి మూడో సినిమా!
RX 100 చిత్రంతో టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అందుకొన్న దర్శకుడు అజయ్ భూపతి. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా దర్శకత్వశాఖలో పరిణతి సాధించిన ఈ యువ దర్శకుడు తొలి చిత్రంతోనే సినీ వర్గాల దృష్టిని తనవైపుకు తిప్పుకొన్నాడు. అయితే తొలి చిత్రంతో భారీ హిట్ కొట్టిన అజయ్ భూపతి.. రెండో ప్రయత్నంలో మహా సముద్రం మూవీతో ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయారు. మహా సముద్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొన్న అజయ్ భూపతి ఇప్పుడు మాస్, మసాలా మూవీతో సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే అజయ్ భూపతి తన మూడో చిత్రానికి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారబోతున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

అజయ్ భూపతి రూపొందించే చిత్రంలో భారీ సంఖ్యలో పాత్రలు ఉంటాయి. దాదాపు 25 మంది పాపులారిటీ ఉన్న నటులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తారు. ఈ సినిమాను ఈ నెలాఖరుకు సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను దాదాపు మూడు నెలలుపాటు షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు 30 రోజులు పాటు నైట్ ఎఫెక్ట్‌లో షూట్ చేయనున్నారు అని విశ్వసనీయమైన సమాచారం.
అజయ్ భూపతి రూపొందించబోయే సినిమాకు ఓ క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు మంగళవారం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు నటీనటులు మాత్రమే కాకుండా బాహు భాష నటులు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











